చెరువులో ప్రభుత్వ విప్ ఆటపాట స్నేహితులతో
నవతెలంగాణ – ఆలేరు
ప్రభుత్వ వీఫ్ బిర్ల ఐలయ్య స్వగ్రామం సైదపురం చెరువు నిండిన విషయం తెలిసి అక్కడికి వచ్చారు. బుధవారం సాయంత్రం ఆనందంతో గ్రామ ప్రజలు స్నేహితులతో కలిసి చెరువులోకి దిగి నృత్యం చేశారు. ఏయ్ చిందే ఏయ్… ఐలన్న.. .. నీరు వచ్చే ఐలన్న సంతోషం ఇచ్చే ఐలన్న… అంటూ చిన్ననాటి స్నేహితులతో చెరువులో ఆడుకున్న విషయాలు గుర్తు తెచ్చుకొని పాట పాడుకుంటూ ఒకరిపై ఒకరు నీళ్లు.బట్టలు తడిచే విధంగా చల్లుకొని ఈత కొట్టారు .చేపలు పట్టారు.గంగమ్మ తల్లికి పసుపు కుంకుమలతో పూజలు చేశారు.
గోదావరి నీళ్లు తీసుకువచ్చి గంధ మల్ల ప్రాజెక్టు నింపి నియోజకవర్గంలోని గొలుసు కట్టు చెరువులను నీటితో నింపుతా రైతు సంఘానికి సాగునీరుస్తానని ఎన్నికల వాగ్దానం చేసి ఎన్నికల్లో గెలుపొందారు.గత వేసవి కాలంలో గోదావరి నీళ్ల ద్వారా వేసవికాలంలో చెరువుల ను నింపే ప్రజలను ఆశ్చర్యపరిచారు.
సోషల్ మీడియాలో నీళ్ల ఐలయ్యగా రైతుల మన్ననలు పొందారు..వారం రోజులుగా వర్షాలు సమృద్ధిగా కురస్తుండడంతో వర్ష కాలం ముందే 40 శాతం వరకు వేసవిలో నింపిన నీళ్లు చెరువుల్లో ఉండడంతో ఇటీవల కురిసిన వర్షాలకు వాగులు పారుతూ చెరువులు నిండుతున్నాయి వచ్చే వేసవి రబీ సీజన్ కూడా నియోజకవర్గంలో సమృద్ధిగా నీరు ఉంటాయి.ఈ ఆనందంలోగ్రామంలోని ప్రజలు చెరువు వద్దకు చేరుకొని ఎమ్మెల్యేతో కలిసి పూజలు చేసి సంతోషం పంచుకున్నారు.వీరితో పాటు తాసిల్దార్ గణేష్ నాయక్ సీఐ ఎంపీపీ శ్రీశైలం కాంగ్రెస్ నాయకులు వెంకటరెడ్డి, కిష్టయ్య, ఎస్కే మంజూరు, నంద వెంకటేష్, స్నేహితులు ప్రజలు ఉన్నారు.