గత పాలనా.? మీ పాలనా.? పక్కన పెడితే సీఎంగా మీరు కలవడం చాలా సంతోషంగా ఉంది: కార్మికులు
నవతెలంగాణ – బంజారా హిల్స్
కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని జూబ్లీహిల్స్ రోడ్ నెం.45 లో నిర్మాణంలో ఉన్న జీహెచ్ఎంసీ పార్కు పనులను ఆకస్మికంగా పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కార్మికులను కలసిన సందర్భంగా వాక్యాలు చేసినట్లు సమాచారం. అయితే కార్మికులు మాత్రం అందరు చెప్పేది అదే .? కానీ సీఎంగా మీరు కలవడం జీవితంలో మర్చిపోలేని గొప్ప అనుభూతి, చాలా సంతోషంగా ఉందని, గత పాలనా..? మీ పాలనా.? పక్కన పెడితే.. మీరు మాతో కలిసి పనులు ఏలా జరుగుతున్నాయో అడిగి తెలుసుకోవడం ఆనందంగా ఉందనీ వారు సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడుతూ తెలిపారు.
పలు వివాహ శుభకార్యాలకు హాజరై తిరిగివస్తున్న సందర్భంలో పార్కు వద్ద ఆగి పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి, వ్యర్థలతో నిండి ఉన్న ఈ ప్రభుత్వ స్థలం కబ్జాకు గురికాకుండా.. పార్కు నిర్మాణం చేయాలని గతంలో జీహెచ్ఎంసీని ఆదేశించిన సీఎం, నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో పార్కులో జరుగుతున్న పనులను ఆకస్మికంగా పరిశీలించి పార్క్లో పనిచేస్తున్న కార్మికులను ఆప్యాయంగా పలకరించారు. వారి బాగోగులు అడిగి తెలుసుకోవడం, పనులకు సంబంధించిన వివరాలతో పాటు వారి సమస్యలను అడిగి తెలుసుకొని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.



