– కమిటీలతో కాలయాపన చేయకుండా సత్వరమే పరిష్కరించాలి : టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వ సాచివేత ధోరణి సరైంది కాదని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర కమిటీ విమర్శించింది. కమిటీలతో కాలయాపన చేయకుండా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేసింది. పోరాటాలు చేయాల్సిన అనివార్యతను కల్పించొద్దని సూచించింది. టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చావ రవి అధ్యక్షతన గురువారం హైదరాబాద్‌లోని దోమల్‌గూడలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ సాచివేత ధోరణితో కాలయాపన చేయడాన్ని క్షేత్రస్థాయిలో తీవ్రంగా నిరసిస్తున్నారని చెప్పారు. ఉద్యోగుల్లో అసంతృప్తి ఆందోళనగా మారుతోందనీ, ప్రభుత్వం గమనించకపోచే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నెల మొదటి తారీఖున జీతం చెల్లిస్తున్నామనే ఒక్క అంశం తప్ప ఇతర సమస్యలేవి పట్టించుకోవడం లేదని అన్నారు. గురుకుల పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో పనిచేసే ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇప్పటికీ మొదటి తారీఖున వేతనాలు అందడం లేదన్నారు. ప్రతినెలా ఆలస్యంగా చెల్లిస్తున్నారని గుర్తు చేశారు. పెండింగ్ బిల్లుల చెల్లింపు విషయంలో నెలకు రూ.500 కోట్లు కేటాయించి పరిష్కారం చేస్తామంటూ మార్చిలో ఉప ముఖ్యమంత్రి భట్టి ఇచ్చిన హామి కూడా అమల్లోకి రాకపోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు. ప్రభుత్వం నియమించిన కమిటీ దృష్టికి ఆర్థిక, ఆర్థికేతర డిమాండ్లను తెచ్చినప్పటికీ కనీసం ఆర్థికేతర డిమాండ్లను కూడా పరిష్కరించడంలో ప్రభుత్వం చొరవ చూపకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏల్లో కనీసం మూడైనా వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాఠశాలల పున:ప్రారంభానికి ముందే అన్ని గురుకుల పాఠశాల సమయసారణిని ఉదయం తొమ్మిది నుంచి ప్రాంరభమయ్యే విధంగా మార్చాలని కోరారు. ఇది విద్యార్థుల దృష్ట్యా ఆలోచన చేయాలని సూచించారు. ఉద్యోగ సమస్యలపై ప్రభుత్వం ఇదే సాచివేత దోరణితో వ్యవహరిస్తే స్వతంత్ర పోరాటాలతోపాటు, ఉపాధ్యాయులను ఏకం చేసి ఐక్య ఉద్యమాలను ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
ఉపాధ్యాయుల సర్దుబాటు ఉత్తర్వులను వ్యతిరేకిస్తున్నాం : వెంకటి
రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థుల నమోదు కోసం శుక్రవారం నుంచి చేపడుతున్న బడిబాట కార్యక్రమాన్ని అభినందిస్తున్నామని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ వెంకటి అన్నారు. విద్యాశాఖాధికారులు తొందరపాటుగా ఇచ్చిన మెమో నెంబర్ 1267 ద్వారా ఉపాధ్యాయుల సర్దుబాటు చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా మన్నారు. ఈ మెమో ఒకవైపు నోటితో నవ్వి మరొకవైపు నొసటితో వెక్కిరించినట్టుగా ఉందని చెప్పారు. ఒకవైపు బడిబాట పేరుతో మూసి ఉన్న పాఠశాలలను తెరిచే విధంగా, విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నచోట పెంచే విధంగా చర్యలు తీసుకునేందుకే బడిబాట నిర్వహిస్తు న్నారన్నారు. దానికి పూర్తి భిన్నంగా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని కారణంతో బడిబాట కార్యక్రమం పూర్తికాకముందే, పాఠశాలల పున:ప్రారంభానికి ముందే టీచర్లను సర్దుబాటు చేయడానికి పూనుకోవడం ప్రభుత్వ పాఠశాలల సహజ మరణానికి ఊతమిచ్చేదిగా ఉందని విమర్శించారు. దీంతో తల్లిదండ్రుల్లో ఎలా నమ్మకం కలిగించి, పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచుతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రాథమిక పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులు ప్రారంభించాలనీ, తరగతికి ఒక గది, తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండే విధంగా తల్లిదండ్రులు కోరుకుంటున్న సందర్భంలో నిబంధనలు సవరించి, విద్యార్థుల నమోదు పూర్తయ్యాక ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనలు అమలు చేయాలనీ, డిప్యూటీ ఈవో, డైట్ లెక్చరర్లు, ఎంఈవో పోస్టులకు విద్యా శాఖ పరిధిలోని ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని కోరారు. పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనాన్ని మరింత పౌష్టికంగా అందించడంతోపాటు ఉదయం అల్పాహారం, సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలని సూచించారు. స్థానిక పాఠశాలల పిల్లల సంఖ్యను పెంచడానికి స్థానిక సంస్థల ప్రతినిధులను, ప్రభుత్వ అధికారులను భాగస్వాములను చేయాలని చెప్పారు. ఏటా పదోన్నతులు, బదిలీలు నిర్వహిస్తామంటూ ఇచ్చిన హామీ మేరకు ఈనెల, వచ్చేనెల అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలల్లో వాటిని పూర్తిచేయాలని కోరారు. ఖాళీ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మోడల్ స్కూళ్లను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలనీ, టీచర్లకు పదోన్నతులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. గురుకుల, మోడల్ స్కూల్ టీచర్లకు 010 పద్దు కింద వేతనాలివ్వాలనీ, కెేజీబీవీ టీచర్లకు మినిమం పేస్కేలు వర్తింపజేయాలని సమావేశంలో తీర్మానించామని వివరించారు. ఈ సమావేశంలో టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ దుర్గాభవాని, కోశాధికారి టి లక్ష్మారెడ్డి, పత్రిక ప్రధాన సంపాదకులు పి మాణిక్‌రెడ్డి, ఎఫ్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర చైర్మెన్ ఎం రాజశేఖర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కె సోమశేఖర్, వి శాంతికుమారి, జి సమ్మారావు, డి సత్యానంద్, జి నాగమణి, కె రంజిత్‌కుమార్, ఎస్ మల్లారెడ్డి, కె రవికుమార్, ఎ సింహాచలం, వై జ్ఞానమంజరి, ఎం వెంకటప్ప, ఎఫ్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జివి నాగమల్లేశ్వరరావులతోపాటు వివిధ జిల్లాల అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు, రాష్ట్రకమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఉద్యోగుల సమస్యలపై సర్కారు సాచివేత ధోరణి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES