నవతెలంగాణ – కంఠేశ్వర్
పెన్షనర్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని, మార్కెటింగ్ ,యూత్ అండ్ స్పోర్ట్స్ పెన్షనర్లకు ఇంతవరకు పెన్షన్ జమ కాలేదని, నాలుగు నెలలుగా పెన్షన్ లేకుండా ఏ విధంగా బ్రతుకుతారో ప్రభుత్వం ఆలోచించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సిర్ప హనుమాన్లు ఆరోపించారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ. 2024 తర్వాత రిటైర్ అయినటువంటి వారి పెన్షనరీ బెనిఫిట్స్ ఈరోజు వరకు రాలేదని , నగదు రహిత వైద్యం ఎండమావిలా మారాయి. తక్షణమే పెన్షనరీ బెనిఫిట్స్ చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా నాయకులు ఈవీఎల్ నారాయణ, రాధా కిషన్, పురుషోత్తం రావు, బాలయ్య, మధుసూదన్, భోజరావు,సాగర్, బాల దుర్గయ్య, పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పెన్షనర్ల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



