– సీఐటీయా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డబ్బికార్ మల్లేష్
నవతెలంగాణ – మిర్యాలగూడ : కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు పాటుపడాలని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డబ్బికార్ మల్లేష్ కోరారు. శనివారం స్థానిక సిఐటియు కార్యాలయంలో బిల్డింగ్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వాలు పాత చట్టాలను రద్దుచేసి కొత్త చట్టాలను అమలు చేస్తుందని ఆరోపించారు. దానివలన కార్మికులు శ్రమదోపిడికి గురవుతున్నారని, శ్రమకు తగ్గ వేతనం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాలని కోరారు. కార్మికులు ఐక్యంగా ఉండి హక్కుల సాధన కోసం బలమైన ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఆపదలో ఉన్న కార్మికులకు ఆదుకునే విధంగా సంఘం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి, జిల్లా నాయకులు బావాండ్ల పాండు, రామారావు, బిల్డింగ్ వర్కర్స్ ఆధర్ కన్స్ట్రక్షన్స్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి మంద రాజు, యూనియన్ కోశాధికారి గోవర్ధన్ రెడ్డి,ఉబ్బపల్లి బుచ్చిబాబు, పోకల ప్రసాద్, జానయ్య, రాంబాబు, క్రాంతి, శ్రీను, రామ్మూర్తి, శ్రీదేవి, శాంతమ్మ, యాదగిరి,కిరణ్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.
కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు పాటుపడాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



