Tuesday, October 7, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఖైరతాబాద్ గ‌ణేష్‌కు గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ తొలి పూజ‌

ఖైరతాబాద్ గ‌ణేష్‌కు గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ తొలి పూజ‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఖైరతాబాద్‌ మహా గణనాయకుడి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అక్కడ తొలిపూజ చేశారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, కాంగ్రెస్‌ నేతలు పాల్గొన్నారు. అయితే ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నా ఖైరతాబాద్‌ బడా గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.

ఈ ఏడాది స్వామివారు శ్రీవిశ్వశాంతి మహా గణపతిగా దర్శనమిస్తున్నారు. మొత్తం 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో విగ్రహాన్ని రూపొందించారు. గణేశుడికి కుడివైపున శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు, ఎడమ వైపున ఖైరతాబాద్‌ గ్రామదేవత గజ్జలమ్మ ఉన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -