- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఫ్యామిలీ వరకట్న వేధింపుల ఆరోపణల్లో చిక్కుకుంది. గవర్నర్ మనవడు దేవేంద్ర గెహ్లాట్‌పై ఆయన భార్య దివ్య గెహ్లాట్ తీవ్ర ఆరోపణలు చేశారు. వరకట్న వేధింపులు, హత్యాయత్నం, గృహ హింస, తన మైనర్ కుమార్తె అపహరణపై మధ్యప్రదేశ్ రత్లాం ఎస్పీ అమిత్‌కు ఆమె లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. రూ.50 లక్షల కట్నం కోసం వేధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును పోలీసులు స్వీకరించి విచారణ ప్రారంభించారు.
- Advertisement -



