Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంబీజేపీలో చేరిన గువ్వల బాలరాజు

బీజేపీలో చేరిన గువ్వల బాలరాజు

- Advertisement -

– కండువా కప్పి ఆహ్వానించిన రామచందర్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.రాంచందర్‌రావు కండువా కప్పి ఆహ్వానించారు. ప్రాథమిక సభ్యత్వాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కల్వకుర్తి ఇన్‌చార్జి తల్లోజు ఆచారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్‌ కాసం వెంకటేశ్వర్లు యాదవ్‌, ప్రేమేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్‌రెడ్డి, అధికార ప్రతినిధి ఎన్వీ.సుభాశ్‌, కోశాధికారి శాంతికుమార్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లా, అచ్చంపేట నియోజకవర్గ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్‌.రాంచందర్‌రావు మాట్లాడుతూ..తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి 13.9 శాతం ఓటింగ్‌ వస్తే పార్లమెంట్‌ ఎన్నికలకు వచ్చేసరికి అది 36 శాతానికి పెరిగిందని వివరించారు. మూడు ఎమ్మెల్సీ స్థానాలు గెలిచామని చెప్పారు. బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్రంలో సున్నా అయిందని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తమ పార్టీదే గెలుపు అని చెప్పారు. హరీశ్‌బాబు మాట్లాడుతూ…ఉత్తర తెలంగాణలో బీజేపీ పట్టిసాధించిందనీ, రానున్న రోజుల్లో దక్షిణ తెలంగాణలో చేరికల పరంపరతో బలపడతామని చెప్పారు. బాలరాజుకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలను దశాబ్దాలుగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మోసం చేస్తూ పోతున్నాయని విమర్శించారు. అన్నిరకాలుగా అధ్యయనం చేసిన తర్వాతనే మోడీ ప్రజా సంక్షేమానికి ఆకర్షితుడినై బీజేపీలో చేరుతున్నానని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ ఇంపోర్టెడ్‌ నాయకత్వంలో నడుస్తున్నదని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు భిక్షపెట్టారనీ, ఆయన ఎవ్వరికీ భిక్ష పెట్టలేదని విమర్శించారు. కేటీఆర్‌ వయస్సులో తన కంటే ఆరు నెలలో, ఏడాదో పెద్దనీ, ఆయన ముందు తానెలా బచ్చా అవుతానని ప్రశ్నించారు. తన కుటుంబంపై సోషల్‌మీడియాలో ట్రోలింగ్‌లు ఆపాలని బీఆర్‌ఎస్‌ నేతలను కోరారు. లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయనీ, న్యాయపరంగానూ ముందుకెళ్తానని హెచ్చరించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img