ప్రచారానికి ఒక్కొక్కరికి రూ.300
గ్రామాల్లో వాహనాలతో ప్రచారం
రాత్రి బీరు బిర్యానీ
పలు సంఘాలకు ఆఫర్లు
నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలో పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారాన్ని తలపిస్తూ గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారం జరుగుతుంది. అభ్యర్థులు ఖర్చులకు భయపడకుండా, గెలుపే లక్ష్యంగా, ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ప్రచారానికి రూ 300 ఇస్తూ 10 నుండి 50 మంది వరకు ప్రచారం చేస్తున్నారు. పలు గ్రామాల్లో ప్రచారానికి వాహనాలను వాడుతున్నారు. రాత్రి అయదంటే బీరు బిర్యానీ, వాటర్ తో గ్రామ సీమలు ఓట్ల “పండగా” నూ తలపిస్తున్నాయి. పలు గ్రామాల్లో సంఘాలకు గిఫ్టులు, భూమిని, డబ్బులను అందిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా గురువారం సాయంత్రం అభ్యర్థుల భవిష్యత్తును ఓటర్లు తమ ఓటు ద్వారా ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి.
అసెంబ్లీ ఎన్నికలు తలపిస్తున్న జీపీ ఎన్నికలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


