పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సరళి పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
మూడు మండలాల్లో 80.78 శాతం ఓట్ల నమోదు
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట తంగళ్ళపల్లి బోయినపల్లి మండలాల్లో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ఆదివారం జరిగింది. బోయినపల్లి మండలంలో పురుషుల ఓట్లు 14753, స్త్రీల ఓట్లు 15752 మొత్తం 30505 ఓట్లకు 24437 ఓట్లు పోలు కాగా 80.11 శాతం, ఇల్లంతకుంట మండలంలో పురుషుల ఓట్లు 17401 స్త్రీల ఓట్లు 18531 మొత్తం 35932 ఓట్లకు 30413 ఓట్లు పోలు కాగా 84.64 శాతం, తంగళ్ళపల్లి మండలంలో పురుషుల ఓట్లు 18619 స్త్రీల ఓట్లు 19848 మొత్తం 38468 ఓట్లకు 29896 ఓట్లు పోలుకాగా 77.72 శాతం పోలయ్యాయి. మూడు మండలాలు కలిపి 80.78 శాతం ఓట్లు నమోదు అయ్యాయి.బోయినపల్లి,కోదురుపాక,నీలోజపల్లి,విలసాగర్, ఇల్లంతకుంట మండలంలోనీ ఇల్లంతకుంట, కందికట్కూర్, పోత్తూరు, అనంతారం గ్రామాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ మహేష్ బిగితే సందర్శించి పోలింగ్ జరుగుతున్న తిరును పరిశీలించి విధులలో ఉన్న సిబ్బందికి భద్రత పరమైన పలు సూచనలు చేశారు.
వృద్ధురాలిని ఆప్యాయంగా పలకరించిన జిల్లా ఎస్పీ
ఇల్లంతకుంట మండలంలో పోలింగ్ కేంద్రం పరిశీలనలో బాగంగా 100 సంవత్సరాలు నిండి ఓటు హక్కును వినియోగించుకువడానికి వచ్చిన లక్ష్మీ అనే వృద్ధురాలిని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆప్యాయంగా పలకరించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.జిల్లా ప్రజలు శాంతియుతవారణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ఈసందర్భంగా ఎస్పీ తెలిపారు.
బోయినపల్లి, ఇల్లంతకుంట,తంగాలపల్లి మండలాలలో పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారులకు, సిబ్బందికి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేల భద్రత పరమైన పలు సూచనలు చేశారు.
రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.పెట్రోలింగ్ వాహనాలు,ప్రత్యేక పోలీసు బృందాలు నిరంతరం పర్యటిస్తూ శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
జీపీ పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ పరిశీలించిన ఇంచార్జి కలెక్టర్
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రెండో ఫేజ్ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన పలు పోలింగ్ కేంద్రాలను ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ ఆదివారం పరిశీలించారు. బోయినపల్లి, నీలోజిపల్లి గ్రామాల్లోని పాఠశాలలు ఇంచార్జి కలెక్టర్, తంగళ్ళపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో పోలింగ్ కేంద్రాలను ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఓటింగ్ సరళిని పరిశీలించి, అధికారులతో మాట్లాడారు. పోలింగ్ కేంద్రంలో ఆవరణలో పరిశీలించారు. ఓటింగ్ పూర్తి అయిన తర్వాత చేపట్టనున్న ఓట్ల లెక్కింపు తదితర అంశాలపై సూచనలు చేశారు.
వెబ్ కాస్టింగ్ సెంటర్ ను పరిశీలించిన ఇంచార్జి కలెక్టర్
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రెండో ఫేజ్ ఎన్నికల సందర్భంగా క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సెంటర్ ద్వారా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదివారం పరిశీలించారు. ఇల్లంతకుంట, బోయినపల్లి, తంగళ్ళపల్లి మండలాల్లో మొత్తం 195 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ కొనసాగుతుండగా, ఐడీఓసీలోని సెంటర్ ద్వారా పరిశీలించారు. సెంటర్ లోని సిబ్బందికి సూచనలు చేశారు.



