Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్జీపీ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి

జీపీ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి

- Advertisement -

నవతెలంగాణ – మునుగోడు
గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం నెలకు 26 వేలు ఇవ్వాలి అని సిఐటియు మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు డిమాండ్ చేశారు. బుధవారం గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఎంపీడీవో యుగేందర్ రెడ్డికి పలు డిమాండ్ల తో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలీచాలని వేతనాలతో  గ్రామపంచాయతీ కార్మికులను ఎట్టి చాకిరి చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు వస్తే తప్ప కుటుంబం గడవని గ్రామపంచాయతీ కార్మికులకు నెలలు తరబడి జీతాలు చెల్లించకుండా పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతినెల 5వ తేదీన జీతాలు ఇవ్వాలని అధికారులను కోరారు . కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు దుస్తులు ,సబ్బులు, బూట్లు,  సంవత్సరానికి రెండు జతల బట్టలు ఇవ్వాలని  మండల అభివృద్ధి అధికారి కి వినతి పత్రం అందజేశారు . ఈ కార్యక్రమంలో మండల సిఐటియు అధ్యక్షులు పెరుమాళ్ళ రాజు, గౌరవాధ్యక్షులు ఎర్రగోని లింగయ్య , జిల్లా కమిటీ సభ్యులు ఎర్ర అరుణ ,రెడ్డి మల్ల యాదగిరి, కొండోజు సత్యనారాయణ నందిపాటి జలంధర్ , కొప్పోలు లింగయ్య ,పెద్దమ్మ , అండాలు ,సంపూర్ణ ,పావని ,గోసుకొండ నరసింహ, గోవర్ధన్, సింగపంగా సాయిలు ,అండాలు ,గోపమ్మ ,వెంకటమ్మ , ఏర్పుల మోహన్ బాబు తదితరులున్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad