Friday, November 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మిల్లర్లు బీజీలు సమర్పిస్తే ధాన్యం కేటాయింపు..

మిల్లర్లు బీజీలు సమర్పిస్తే ధాన్యం కేటాయింపు..

- Advertisement -

అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్
నవతెలంగాణ – వనపర్తి

జిల్లాలో ఖరీఫ్ 2025-26 సీజన్ కు సంబంధించి ఇంకా బ్యాంకు గ్యారంటీలు సమర్పించని అర్హత కలిగిన మిల్లర్లు వెంటనే బీజీలు సమర్పిస్తే ధాన్యం కేటాయించడం జరుగుతుందని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్ సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సూచన మేరకు అదనపు కలెక్టర్ రెవెన్యూ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ 2025 26 సీజన్ కు సంబంధించి అర్హత సాధించిన 80 మిల్లులకు గాను 18 మిల్లు లు ఇప్పటికే బ్యాంకు గ్యారంటీలు సమర్పించగా వారికి ధాన్యం కేటాయించడం జరుగుతోoదని తెలిపారు. ఇంకా బ్యాంకు గ్యారంటీలు సమర్పించని మిల్లర్లు వేగంగా 10 శాతం బీజీలు సమర్పించాలని ఆదేశించారు. మిల్లర్లు బదులిస్తూ రెండు, మూడు రోజుల్లో బ్యాంకు గ్యారంటీలు సమర్పించే విధంగా ప్రయత్నిస్తామని తెలియజేశారు. బ్యాంకు గ్యారంటీ ల విషయంలో మిల్లర్లకు ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించేందుకు సహకరిస్తామని లీడ్ బ్యాంకు మేనేజర్ తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కాశీ విశ్వనాథ్, డిఎం జగన్, మిల్లర్లు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -