Tuesday, October 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బ్యాంకు గ్యారంటీల మిల్లర్లకే ధాన్యం కేటాయింపులు

బ్యాంకు గ్యారంటీల మిల్లర్లకే ధాన్యం కేటాయింపులు

- Advertisement -

అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్
నవతెలంగాణ – వనపర్తి

రాబోయే వారం రోజుల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని, బ్యాంకు గ్యారంటీలు ఇచ్చిన మిల్లర్లకే ధాన్యం కేటాయింపులు చేయడం జరుగుతుందని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో ని సమావేశం మందిరంలో జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే వారం రోజుల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని, బ్యాంకు గ్యారంటీలు ఇచ్చిన మిల్లర్లకే ధాన్యం కేటాయింపులు చేయడం జరుగుతుందని అన్నారు. గత సీజన్లలో ఆయా మిల్లర్లు వారు పూర్తి చేసిన సీ ఎం ఆర్ కు అనుగుణంగా నిబంధనల ప్రకారమే బ్యాంకు గ్యారంటీలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. లేని పక్షంలో కొత్త ధాన్యం కేటాయించడం జరగదని తెలిపారు. 

 ఈ సారి 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నామని, 80 శాతం సన్న ధాన్యమే రాబోతుందని చెప్పారు. ఈ సారి ఎఫ్ ఏ క్యూ ప్రమాణలకు అనుగుణంగా ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. కాబట్టి, ధాన్యం కేటాయింపులు పొందడానికి మిల్లర్లు గతంలో ఉన్న పెండింగ్ పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి కాశీ విశ్వనాథ్, డిఎం జగన్, ఇతర అధికారులు, రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -