Wednesday, November 12, 2025
E-PAPER
Homeజిల్లాలుతేమ శాతం వచ్చిన వెంటనే ధాన్యాన్ని లోడ్ చేయాలి

తేమ శాతం వచ్చిన వెంటనే ధాన్యాన్ని లోడ్ చేయాలి

- Advertisement -

 జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి
నవతెలంగాణ – వనపర్తి

వరి కొనుగోలు కేంద్రాలకు రైతులు తెచ్చిన ధాన్యంలో నిర్దేశించిన తేమ శాతం వచ్చిన వెంటనే కేటాయించిన మిల్లుకు ధాన్యాన్ని లోడ్ చేసి తరలించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ వనపర్తి మండల పరిధిలోని పెద్దగూడెం తండా పరిధిలో ఏర్పాటుచేసిన ఐకెపి వరి కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ రైతులు ఆర పోసుకున్న వరి ధాన్యం యొక్క తేమ శాతాన్ని కలెక్టర్ పరిశీలించారు. పీపీసీ కేంద్రానికి ధాన్యం తెచ్చిన రైతుల రిజిస్టర్ను పరిశీలించిన కలెక్టర్ ఎంతమంది రైతులు వచ్చారు, ఎంతమంది ధాన్యంలో నిర్దేశించిన తేమ వచ్చిందని పరిశీలించారు.

కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు తెచ్చిన ధాన్యంలో నిర్దేశించిన తేమ శాతం రావడంతో కేటాయించిన మిల్లుకు లోడ్ చేసి పంపించాలని సూచించారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు నిబంధనల ప్రకారమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశించారు. కాలిపర్స్ ద్వారా సన్నధాన్యం, దొడ్డు రకం వరి ధాన్యాన్ని పకడ్బందీగా గుర్తించాలని నిర్వాహకులకు సూచించారు. కొనుగోలు కేంద్రానికి వచ్చే రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న పలువురు రైతులు గత సీజన్ కు సంబంధించిన వరి ధాన్యం బోనస్ డబ్బులు ఇంకా రాలేదని కలెక్టర్ ను కోరగా, త్వరలోనే బోనస్ డబ్బులు ప్రభుత్వం రైతుల ఖాతాల్లో వేయడం జరుగుతుందని కలెక్టర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డి సి ఎస్ కాశి విశ్వనాధ్, డిపిఎం ప్రభాకర్, తహసిల్దార్ రమేష్ రెడ్డి, ఎంపీడీవో, ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -