Wednesday, October 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ధాన్యం కొనుగోలు చేపట్టాలి

ధాన్యం కొనుగోలు చేపట్టాలి

- Advertisement -
  • – సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ
  • నవతెలంగాణ – తుర్కపల్లి
  • తుర్కపల్లి మండల కేంద్రంలోని సిపి ఐ ఎం పార్టీ ఆఫీసులో మండల కమిటీ సమావేశం గడ్డమీది నరసింహ అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతి థిగా సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ హాజరై మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా సొసైటీ ఐకెపి సెంటర్లను ప్రారంభించి వరి ధాన్యాన్ని కొనుగోలును చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల వ్యాప్తంగా రైతులు 20 రోజుల నుండి వారి ధాన్యాన్ని పిఎసిఎస్ ఐకెపి సెంటర్లకు తీసుకువచ్చి కొనుగోలు కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మండల వ్యాప్తంగా కొన్ని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు మరికొన్నిటిని నేటి వరకు ప్రారంభించలేకపోయారని అన్నారు.
  • అకాల వర్షానికి వారి ధాన్యం తడిసి మొలకెత్తి నల్లగా అవుతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు ధాన్యాన్ని నిలువ చేసేందుకు పెద్ద రైతులు సుమారు ఇప్పటికే 10 వేల వరకు ఖర్చు వచ్చిందని ఇప్పటికైనా ప్రభుత్వం కనికరించి వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాల్సిందిగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిన వారి ధాన్యాన్ని వాటికి పట్టాల వసతులు ప్రభుత్వమే కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి పోతరాజు జహంగీర్ మండల కమిటీ సభ్యులు కొక్కొండ లింగయ్య తలారి మాతయ్య తూటి వెంకటేశం గడ్డమీది నరసింహ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -