- Advertisement -
నవతెలంగాణ – వలిగొండ రూరల్
మండలంలోని వివిధ గ్రామాలలో రైతులు కొనుగోలు కేంద్రాలలో నిల్వచేసిన ధాన్యం రాసులు మంగళవారం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి తడిసిపోయింది. అధికారులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయడం ఆలస్యం కావడం, నాణ్యత పేరుతో కొనుగోళ్లు ఆలస్యం కావడం రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధాన్యం రాసులు కవర్లు కప్పిన వర్షపు నీరు కిందిభాగం నుండి చేరుకొని ధాన్యం తడిసిపోతుంది. వీలైనంత తొందరగా ధాన్యం తూకం వేసి ఎగుమతులు చేయాలని పలువురు రైతులు కోరుతున్నారు.
- Advertisement -



