నవతెలంగాణ – ఆర్మూర్
ఆలూర్ మండలంలోని మాచర్ల గ్రామంలో శుక్రవారం ఉపాధి హామీ పథకంపై గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా రాబోయే సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ తయారీ, గ్రామంలో చేపట్టబోయే పనుల గుర్తింపు మరియు ఆమోదంపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో గంగాధర్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం గ్రామాల అభివృద్ధికి ముఖ్యమైన పథకం అని ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పనులు గుర్తించి పారదర్శకంగా అమలు చేయాలి. ప్రతి కుటుంబం ఈ పథకం ద్వారా లబ్ధి పొందేలా చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. అదేవిధంగా, ఇందిరమ్మ ఇళ్ల పదవగతి పురోగతిపై కూడా చర్చించి, పనులను వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రత్యేక అధికారి నితీష్, ఎంపీడీవో పంచాయతీ కార్యదర్శి నసీర్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
మాచర్లలో ఉపాధి పథకంపై గ్రామసభ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



