నవతెలంగాణ – భీంగల్ : ముత్యాల సునీల్ కుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈరోజు భీంగల్ మండల కేంద్రంలో మండల అధ్యక్షులు బొదిరే స్వామి ఆధ్వర్యంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ జన్మదినం సందర్భంగా చొక్కయ్యగుట్ట అయ్యప్ప మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఇలాంటి జన్మదిన వేడుకలు ఆయన మరెన్నో జరుపుకోవాలని అయ్యప్ప స్వామిని వేడుకోవడం జరిగింది. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జెజె నర్సయ్య, మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లెల లక్ష్మణ్,యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు నాగేంద్ర, డిసిసి డెలిగేట్ మెండోరా ఉప సర్పంచ్ కుంట రమేష్, అనంతరావు,వాకా మహేష్, సమీర్, గోవర్ధన్, రాజు, అశోక్, శివ, జేమ్స్, రాజేష్, మహిళా అధ్యక్షురాలు కల్పన, గంగామణి, ఎంకమ్మాషాదుల్ల, సమ్మి, గణేష్, గంగాధర్, అజ్మత్, వసుంధర్, సుంకరి సురేష్, అంజుమ్, భూషణ్, పల్లె శేఖర్, లింబాద్రి, జుబేర్, శ్రీను, దినేష్, సతీష్, నవీద్, సంగ్య నాయక్, రాజేశ్వర్, చిన్న రెడ్డి, అరికెల దాసు, రాము, లక్ష్మణ్, శ్రీకాంత్, మహేష్, వంశీ, ప్రేమ్ మండలంలోని అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.



