Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా గురుపూజోత్సవం

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా గురుపూజోత్సవం

- Advertisement -

– ప్రయివేట్ ఉపాద్యాయ దంపతులకు సన్మానం
నవతెలంగాణ – అశ్వారావుపేట

భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినం పురస్కరించుకుని నిర్వహించే గురు పూజోత్సవాన్ని అశ్వారావుపేట లయన్స్ క్లబ్ ఆద్వర్యంలో అద్యక్షులు లక్కినేని నరేంద్ర నేతృత్వంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అశ్వారావుపేట,దమ్మపేట మండలాలకు చెందిన పలువురు ప్రైవేట్ ఉపాధ్యాయులను శాలువా తో సత్కరించారు.

విశ్రాంత ఉపాద్యాయులు యూఎస్ ప్రకాష్ రావు,అద్దంకి లక్ష్మీనారాయణ,ప్రభుత్వ జూనియర్ కాలేజి లెక్చరర్ అరవింద్, దమ్మపేట కు చెందిన సీనియర్ ఉపాద్యాయులు సదాశివ మాస్టార్,శ్రీ గౌతమి పాఠశాల నిర్వాహకులు, ఉపాద్యాయ దంపతులు కొఠారి చలపతిరావు – లక్ష్మి దంపతులను  ఘనంగా సన్మానించి, వారి విద్యా సేవలను కొనియాడారు.  ఈ కార్యక్రమంలో సీనియర్ లైన్ మెంబర్స్ కోటగిరి మోహన్ రావు,బలమూరి సూర్య రావు, దార మల్లికార్జున రావు, ఐతం వెంకటేశ్వరరావు,బ్రహ్మ రావు, దూపకుంట్ల దుర్గారావు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad