- Advertisement -
నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం బోర్గం గ్రామంలో పొలాల అమావాస్య వేడుకలను గ్రామస్తులు, రైతులు ఘనంగా నిర్వహించారు. రైతులు తమ వద్దనున్న ఎడ్లు, ఆవులు, దూడలకు శుభ్రంగా కడిగి వాటికి రంగురంగుల కలర్ లను పూసి వాటికి పోలేలు చేసి తినిపించడం ఆనవాయితీగా మారింది. దీంతో పాటు రైతులు పాడిపంటలు, తమ గ్రామాలు చల్లగా ఉండాలని కోరుతూ వారు ఎద్దుల పైన వివిధ రకాలైన బట్టలను వేసి హనుమాన్ మందిరం చుట్టూ తిప్పుతారు. సాయంత్రం వాటికి పోలీసులు తినిపిస్తారు, పశువులకు ఎలాంటి హాని జరగకుండా గ్రామ చావిడి వద్ద నుంచి బయలుదేరి హనుమాన్ మందిరం చుట్టూ తిప్పుతారు.
- Advertisement -