నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామంలోని దర్పల్లి కు వెళ్లే రాహదరి వద్ద ఉన్న పెద్దమ్మ తల్లి 22వ ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామంలోని సంఘ సభ్యుల ఇంటి నుండి పెద్దమ్మ బోనాలను డప్పు వాయిద్యాలతో గ్రామం నుండి రహదారి వద్ద ఉన్న ఆలయానికి చేరుకున్నట్లు పెద్దమ్మ అలయ కమిటీ అధ్యక్షులు బొడ్డు రవి, సంఘం అధ్యక్షులు అర్ మల్లయ్య వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత 22 ఏళ్ళుగా పెద్దమ్మ తల్లి అలయ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహిస్తామని, ప్రతి ఏటా నిర్వహించే దానికంటే ఈసారి ఘనంగా గ్రామంలోని ప్రతి ఇంటి నుండి ఒక బోనాల చొప్పున పెద్ద ఎత్తున బోనాల ఊరేగింపు నిర్వహించ మన్నారు. అనంతరం ఆలయంలో అభిషేకం, అర్చనలు, కళ్యాణం, అన్న సత్రం అంగరంగ వైభవంగా నిర్వహించామని పేర్కొన్నారు.వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి భారీ సంఖ్యలో ప్రజలు భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు.ఈ సమావేశం లో ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షులు సాయిలు, కార్యదర్శి గంగాధర్, లక్ష్మన్, నడ్పి గంగాధర్, నరేష్ ,సాయినాథ్, యోగేశ్వర్ ,పిట్ల సాగర్ , రాములు,పిట్ల ప్రవీణ్ తోపాటు సంఘ సభ్యులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా పెద్దమ్మ బోనాలు, కళ్యాణం, అన్న సత్రం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



