Wednesday, November 12, 2025
E-PAPER
Homeబీజినెస్గ్రాన్యూల్స్‌ లైఫ్‌ సైన్సెస్‌కు తొలిసారి యూఎస్‌ఎఫ్‌డీఏ ఆమోదం

గ్రాన్యూల్స్‌ లైఫ్‌ సైన్సెస్‌కు తొలిసారి యూఎస్‌ఎఫ్‌డీఏ ఆమోదం

- Advertisement -

హైదరాబాద్‌ : ప్రముఖ ఔషద ఉత్పత్తుల కంపెనీ గ్రాన్యూల్స్‌ ఇండియా లిమిటెడ్‌కు చెందిన అనుబంధ సంస్థ అయిన గ్రాన్యూల్స్‌ లైఫ్‌ సైన్సెస్‌ ప్రయివేటు లిమిటెడ్‌ (జీఎల్‌ఎస్‌) తన హైదరాబాద్‌లోని తయారీ కేంద్రానికి మొట్టమొదటి యూఎస్‌ఎఫ్‌డీఏ ఆమోదం లభించింది. ఒక నిర్దిష్ట ఉత్పత్తికి సంబంధించిన ప్రీ-అప్రూవల్‌ ఇన్‌స్పెక్షన్‌ (ఎఫ్‌ఇఐ) జరిగిందని పేర్కొంది. దీంతో జిఎల్‌ఎస్‌ హైదరాబాద్‌ కేంద్రం ఇక అమెరికా మార్కెట్‌కు ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి యూఎస్‌ఎఫ్‌డీఏ ఆమోదం లభించినట్లయ్యింది. భద్రతా కారణాల దష్ట్యా ఆమోదించబడిన ఉత్పత్తి వివరాలను ఆ కంపెనీ వెల్లడించలేదు. ఇది ఇప్పటికే గ్రాన్యూల్స్‌ గగిలాపూర్‌ కేంద్రంలో తయారవుతున్న ఉత్పత్తి అని, ఈ కొత్త ఆమోదంతో మార్కెట్‌ వాటాను పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని గ్రాన్యూల్స్‌ ఇండియా సీఎండీ డాక్టర్‌ కృష్ణ ప్రసాద్‌ చిగురుపాటి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -