నవతెలంగాణ – జన్నారం
వయోవృద్దుల వారోత్సవాల సందర్బంగా సోమవారం జన్నారం మండల కేంద్రములో శరత్ మాక్స్ విజన్ సూపర్ స్పెషలిటీ కంటి దవాఖానా వారి సౌజన్యముతో ఉచిత కంటి శిబిరం మరియు మెడి కవర్ హాస్పిటల్ కరీంనగర్ వారి సౌజన్యముతో వయోవృద్దులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సైండ్ల మొండయ్య జాతీయ కౌన్సిల్ సభ్యులు, సీనియర్ సిటిజెన్ కాన్ఫడరేషన్ మంచిర్యాల హాజరై జ్యోతి ప్రజ్వలన గావించినారు. మొండయ్య మాట్లాడుతు తాను రాష్ట్ర, జాతీయ స్థాయిలో సీనియర్ సిటిజెన్స్ సమస్యలపై గలమెత్తి హక్కుల సాధనకొరకు రాజిలేని పోరాటము చేస్తున్నామన్నారు.వృద్ధాప్యములో తల్లితండ్రులను వారి పిల్లలు పోషించాల్సిన భాద్యత తీసుకోవాలని ఆకాంక్షించినారు. కార్యక్రమం లో సీనియర్ సిటిజెన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గోపి సత్యనారాయణ, కార్యదర్శి దుర్గం రాజలింగం ఉపాధ్యక్షులు పిట్టా రాజారావు, రామకృష్ణ కోశాధికారి పుల్లయ్య కార్యవర్గ సభ్యులు కే తిరుపతి రెడ్డి, రాజలింగు సహాయ కారదర్శి గాబ్రాయల్ పెన్షనర్స్ అసోసియేషన్ జన్నారం మండల అధ్యక్షులు అడ్డగూరి భూమన్న తదితరులు పాల్గొన్నారు.
ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES