Wednesday, December 3, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంగ్లోబల్‌ సమ్మిట్‌ ప్రతినిధులకు సకినాలు, అప్పాలు

గ్లోబల్‌ సమ్మిట్‌ ప్రతినిధులకు సకినాలు, అప్పాలు

- Advertisement -

సంప్రదాయ కళాకృతులు, వంటకాలతో సావనీర్‌ కిట్లు సిద్ధం
నవతెలంగాణ-హైదరాబాద్‌

భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో ఈ నెల 8, 9న జరుగనున్న తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు రానున్న జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులకు తెలంగాణ సంప్రదాయ కళలు, రుచికర వంటకాలతో కూడిన సావనీర్‌ కిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. తెలంగాణ కళలు, సంస్కృతి, పాకశాస్త్ర వారసత్వం ప్రతిబింబించేలా ప్రతినిధులకు అందించే కిట్‌ను రూపొందిస్తున్నారు. గ్లోబల్‌ సమ్మిట్‌ ప్రతినిధులు హైదరాబాద్‌కు చేరుకోగానే ఈ సావనీర్‌ కిట్లతో ఘనంగా స్వాగతం పలుకనున్నారు. ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్‌ ప్రతినిధులు, వివిధ దేశాల నుంచి మంత్రులు, బహుళజాతి కంపెనీల సీఈవోలు, ఆర్థికవేత్తలు, విద్యావేత్తలు గ్లోబల్‌ సమ్మిట్‌కు హాజరు కానున్నారు. పలువురు రాజకీయ ప్రముఖులకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి స్వయంగా ఆహ్వానాలు అందజేసిన సంగతి తెలిసిందే.

హస్తకళలు-సావనీర్‌ కిట్లు
తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ లోగోను పోచంపల్లి ఇక్కత్‌తో తయారు చేశారు. సావనీర్‌ కిట్‌పై ఈ లోగో ఉంటుంది. ప్రతి సావనీర్‌ కిట్‌లో తెలంగాణ సాంస్కృతిక వారసత్వం ప్రతిబింబించే పోచంపల్లి శాలువాలు, చెరియాల్‌ మాస్క్‌లు, హైదరాబాదీ అత్తర్‌, హైదరాబాదీ ముత్యాలతో తయారు చేసిన కరభూషణాలు, చెవిపోగులు వంటి ఆభరణాలు పొందుపరిచారు.

తెలంగాణ వంటకాలతో ఫుడ్‌బాస్కెట్‌
గ్లోబల్‌ సమ్మిట్‌ ప్రతినిధులకు అందించే ఫుడ్‌ బాస్కెట్‌ను తెలంగాణ సంప్రదాయ వంటకాలతో రూపొందించారు. ఆహార బుట్టలో మహువా లడ్డు, సకినాలు, అప్పాలు, బాదం కి జాలి ఉంటాయి. ఇప్పపూలు, బెల్లం, డ్రైఫ్రూట్స్‌, నువ్వులు, కొబ్బరి, నెయ్యితో తయారు చేసే మహువా లడ్డుకు ఆదిలాబాద్‌ ప్రత్యేకం. బాదం, చక్కెర మేళవింపుతో చేసే బాదం కి జాలి స్వీట్‌కు హైదరాబాద్‌ ప్రసిద్ది. సకినాలు, అప్పాలు గ్రామీణ తెలంగాణ పాకశాస్త్ర సంస్కృతిలో అంతర్బాగం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -