- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రతి గురువారం ప్రజల సమస్యలను పరిష్కరించే గ్రీవెన్స్ కార్యక్రమం ను రద్దు చేయడం జరిగిందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు బుధవారం ప్రకటనలో తెలిపారు. కావున జిల్లా లోని ప్రజలు భారీ వర్షాలు కురుస్తున్నందున, ప్రజలు కలెక్టరేట్ కు వచ్చి ఇబ్బందులు పడవద్దనే ఉద్దేశంతో ఈ గ్రీవెన్స్ ను రద్దు చేయడం జరిగిందని, తదుపరి వచ్చే గురువారం గ్రీవెన్స్ యధాతధంగా ఉంటుందని అన్నారు.
- Advertisement -



