Thursday, March 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పొదుపు చేస్తేనే ‘గృహజ్యోతి'

పొదుపు చేస్తేనే ‘గృహజ్యోతి’

- Advertisement -

పరిధి దాటితే బిల్లు చెల్లించాల్సిందే..
నవతెలంగాణ – మల్హర్ రావు

రాష్ట్ర ప్రభుత్వం 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించిన వారికే గృహ జ్యోతి పథకాన్ని వర్తింపజేస్తోంది. మండలంలో చాలామంది వినియోగదారులు విద్యుత్ను పొదుపుగా వాడుకుని పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. చలికాలంలో చాలా గృహాల్లో ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు వాడకపోవడంతో విద్యుత్ వినియోగం బాగా తగ్గింది. వేసవికాలంలో ఇవన్నీ అధికంగా వాడితే కరెంట్ వినియోగం 200 యూనిట్లు దాటితే గృహజ్యోతి పథకం వర్తించదు. అందుకే విద్యుత్ ఆదా చేసుకోవాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు.

మండలంలో 6,164 గృహ కనెక్షన్లు..

మండలంలో మొత్తం 6,164 గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో4741 గృహజ్యోతి కనెక్షన్లు ఉన్నాయి. గత నెలలో 200 యూనిట్లలోపు విద్యుత్ వాడుకొని 4741 మంది లబ్ధిదారులు రాయితీ వాడుకొని సద్వినియోగం చేసుకుంటున్నారు. వీరందరికి రూ.నెలకు రూ.2.84 లక్షలు,ఏడాదికి రూ.3.41 కోట్ల రాయితీ లభించింది. విద్యుత్ పొదుపుగా వినియోగించుకుంటే విద్యుత్తు ఉత్పత్తి తగ్గుతుందని, వేసవిలో విద్యుత్ ఆదా చేసుకోవాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్ళినప్పుడు వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నారు.

పొదుపు చేయడం ఇలా…

మార్కెట్లో లభించే ఫైక్టార్ రేటింగ్ కలిగిన విద్యుత్ పరికరాలు కొను గోలు చేసి ఉపయోగించాలి. ఇంట్లో టీవీలు, బల్బులు, ఫ్యాన్లు, కూలర్లు అవసరం లేనపుడు వాడకూడదు. ఎస్ఈడీ బల్బులే వినియోగించాలి. ఫ్రిజ్ డోర్లు వీలైనన్ని తక్కువసార్లు తెరవాలి. బోరు మోటర్ ఆన్ చేసినపుడు ట్యాంక్ నిండగానే ఆఫ్ చేయాలి. సెల్ఫోన్ చార్జింగ్ పూర్తయ్యాక చార్జర్ ను ప్లగ్ నుంచి తొలగించాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -