Wednesday, December 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కుల సంఘాల భవన నిర్మాణాలకు భూమి పూజ..

కుల సంఘాల భవన నిర్మాణాలకు భూమి పూజ..

- Advertisement -

నవతెలంగాణ – నవీపేట్
మండలంలోని నాలేశ్వర్ విశ్వబ్రాహ్మణ సంఘం, బినోల మున్నూరు కాపు సంఘం ఐరన్ రేకుల షెడ్డు నిర్మాణాలకు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి శుక్రవారం భూమి పూజ చేశారు. అనంతరం బిజెపి కార్యకర్త శాఖపూర్ రవి కుమారుడు మరణించడంతో కుటుంబాన్ని  పరామర్శించారు. అదేవిధంగా మాజీ వైస్ ఎంపీపీ ఇందూరు హరీష్ కోళ్ల ఫారం ముంపుకు గురి కావడంతో ఆయనను పలకరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ధ్యాగ సరీన్, జిల్లా కార్యదర్శి రాధా, జిల్లా సోషల్ మీడియా ఇన్చార్జ్ శ్రీధర్, జిల్లా ఐటీ సెల్ ఇంచార్జ్ శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శిలు రాజేందర్, భూషణ్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -