నవతెలంగాణ – సారంగాపూర్
మండలంలోని చించోలి (బి) సమీపంలోని డ్యాంగాపూర్ వద్ద 12 రకాల న్యాయస్థానాల సముదాయనికి ఆదివారం హైకోర్టు న్యాయమూర్తులు కె సుజన, లక్ష్మణ్ లు భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా హైకోర్టు న్యాయమూర్తులు మాట్లాడారు. న్యాయస్థానాల సముదాయం ప్రధాన న్యాయస్థానంతో పాటు సీనియర్, జూనియర్, సివిల్, సెషన్స్ కోర్టులు, పొక్స్ ఫ్యామిలీ,ఎస్సి, ఎస్టీ న్యాయ స్థానం వంటి 12 రకాల న్యాయస్థానాలు అందుబాటులోకి రానున్నాయన్నారు. దింతో కక్షిదారులకు, బాధితులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల తో పాటు నిర్మల్ జిల్లా కోర్టు న్యామూర్తి శ్రీవాణి,సీనియర్ సివిల్ కోర్టు న్యామూర్తి రాధిక, బార్ అసోసియేషన్ అద్యక్షులు మల్లారెడ్డి,న్యాయవాదులు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
న్యాయస్థానం సముదాయ నిర్మాణం కోసం భూమి పూజ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



