నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని హాసకోతుర్ గ్రామంలో అంగన్వాడి భవన నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ నిర్వహించారు. గ్రామంలో అంగన్వాడీ భవన నిర్మాణానికి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ ముత్యాల సునీల్ రెడ్డి ద్వారా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.12 లక్షలు మంజూరయ్యాయి. అట్టి నిధులతో చేపడుతున్న అంగన్వాడీ భవనానికి కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నరసయ్య భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.
అంగన్వాడి భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, కృషి చేసిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సునీల్ రెడ్డికి స్థానిక కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో చింత రాజా శ్రీనివాస్, గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి నేర ఆంద్రయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంకేట రవి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు పడిగేల ప్రవీణ్, గ్రామ శాఖ అధ్యక్షుడు రేవతి గంగాధర్, నాయకులు గోపిడి లింగారెడ్డి, కుందేటి శ్రీనివాస్, సింగిరెడ్డి శేఖర్, బుచ్చి మల్లయ్య, శైలేందర్, ఊట్నూరి ప్రదీప్, మోహన్ నాయక్, ఏనుగు మనోహర్, ఎడ్ల శ్రీకాంత్, పెద్ది సృజన్, మేడ రమేష్, గడ్డం సంతోష్, క్రాంతి, మోదిని శ్రీధర్, రాజారాం, ధర్మయ్య, రవి, తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడీ భవన నిర్మాణానికి భూమి పూజ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES