Tuesday, December 2, 2025
E-PAPER
Homeజాతీయంఇండిగోకు జీఎస్టీ షాక్.. రూ. 117 కోట్ల భారీ జరిమానా

ఇండిగోకు జీఎస్టీ షాక్.. రూ. 117 కోట్ల భారీ జరిమానా

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌కు జీఎస్టీ విభాగం నుంచి భారీ షాక్ తగిలింది. ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) నిబంధనలకు సంబంధించి కొచ్చి సెంట్రల్ జీఎస్టీ కమిషనరేట్ రూ. 117.52 కోట్ల జరిమానా విధించింది. ఈ మేరకు మంగళవారం కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లకు సమాచారం అందించింది. 2018-19, 2021-22 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి కంపెనీ క్లెయిమ్ చేసిన ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను జీఎస్టీ అధికారులు తిరస్కరించారు. ఈ నేపథ్యంలోనే రూ. 1,17,52,86,402 జరిమానాతో పాటు డిమాండ్ ఆర్డర్ జారీ చేసినట్లు ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ తన ఫైలింగ్‌లో పేర్కొంది. అయితే, అధికారుల ఆదేశాలు లోపభూయిష్టంగా ఉన్నాయని, దీనిపై న్యాయపరంగా తమకు గెలిచే అవకాశాలు బలంగా ఉన్నాయని కంపెనీ విశ్వాసం వ్యక్తం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -