సెయింట్ లూయిస్ చెస్ టోర్నీ
మిస్సోరి (యుఎస్‌ఏ) : ప్రపంచ చెస్ చాంపియన్, భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ సెయింట్ లూయిస్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ టోర్నమెంట్‌లో పుంజుకున్నాడు. గ్రాండ్ చెస్ టూర్‌లో భాగంగా యుఎస్‌ఏలోని ముస్సోరిలో జరుగుతున్న పోటీల్లో.. తొలి రౌండ్లో లెవాన్ అరోనియన్ (యుఎస్‌ఏ) చేతిలో ఓడిన గుకేశ్.. వరుసగా రెండు రౌండ్లలో విజయాలు నమోదు చేశాడు. రెండో రౌండ్లో గ్రిగోరి ఒపారి (యుఎస్‌ఏ), మూడో రౌండ్లో లీ క్వాంగ్ (వియత్నాం)పై గుకేశ్ గెలుపొందాడు. మూడు రౌండ్ల అనంతరం అమెరికా జీఎం అరోనియన్ (6) మూడు విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఫాబియానో కారువానా (5) రెండో స్థానంలో నిలిచాడు. గుకేశ్ (4), వెస్లీ (4) సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు.
మూడో స్థానంలో గుకేశ్
- Advertisement -
- Advertisement -