నవతెలంగాణ- రాయపోల్
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా యూత్ కాంగ్రెస్ కోఆర్డినేటర్లను నియమించింది. దానిలో భాగంగానే రాయపోల్ మండల యూత్ కాంగ్రెస్ కోఆర్డినేటర్ గా మండలంలోని వడ్డేపల్లి గ్రామానికి చెందిన యువ నాయకులు గుంటి నర్సింలు నియామకమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి మండల యూత్ కాంగ్రెస్ కో ఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ బలోపేతానికి,పేదల ప్రజల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఇంటింటికి చేరవేసేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. మండలంలోని కాంగ్రెస్ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు. గ్రామ గ్రామాన యూత్ కాంగ్రెస్ పార్టీ కమిటీలు వేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా లక్ష్యంగా ముందుకు సాగుతామని ఆయన పేర్కొన్నారు.
మండల యూత్ కోఆర్డినేటర్ గా గుంటి నర్సింలు నియామకం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES