బ్రాండ్ అంబాసిడర్‌గా సానియా మీర్జా
న్యూఢిల్లీ : టెన్నిస్ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్) భారత స్పోర్ట్స్ లీగ్‌లో ఎలైట్ జాబితాలో చేరనుంది. ఈ ఏడాది ఏడో సీజన్‌కు సిద్ధమవుతున్న టీపీఎల్‌లో కొత్త ప్రాంఛైజీ చేరింది. వ్యాపార వేత్త గౌరవ్ అగర్వాల్ (హైజియ వెంచర్స్) టీపీఎల్‌లో ప్రాంఛైజీని కొనుగోలు చేశారు. టెన్నిస్ ప్రీమియర్ లీగ్‌లో ప్రస్తుతం ఎనిమిది జట్లు ఉండగా.. గుర్గాన్ గ్రాండ్ స్లామర్స్ తొమ్మిదో జట్టుగా చేరనుంది. ఈ మేరకు టీపీఎల్ సహా వ్యవస్థాపకులు మృనాల్ జైన్ వెల్లడించారు. భారత టెన్నిస్ ముఖచిత్రం, హైదరాబాదీ సానియా మీర్జా గుర్గాన్ గ్రాండ్ స్లామర్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనుంది. గతంలో బెంగాల్ విజార్డ్స్‌కు సానియా మీర్జా ప్రచారకర్తగా పని చేసింది.
టీపీఎల్‌లో గుర్గాన్ గ్రాండ్‌స్లామర్స్
- Advertisement -
- Advertisement -