నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని చౌట్ పల్లి పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారి ఆంధ్రయ్య తో పాటు, పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులు అందరిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ కమల మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయుల ద్వారా చౌట్ పల్లి పాఠశాల అన్ని రంగాల్లో ముందంజలో ఉండడం మాకు గర్వకారణం అని పేర్కొన్నారు. సమా సమాజ నిర్మాతలు, నిస్వర్థ సేవకులు ఉపాధ్యాయులు అన్నారు.
ప్రతి ఒక్కరికి తొలి గురువు తల్లిదండ్రులు అయితే, జీవితాన్నించేది పాఠశాల గురువని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు తమ అనుభవాలను, వారి గురువులను జ్ఞాప్తికి తెచ్చుకున్నారు. అంతకుముందు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో స్థానిక సింగిల్ విండో చైర్మన్ కుంట ప్రతాప్ రెడ్డి, పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు ముసుగు దామోదర్, రాజుల కృష్ణ మురళి, బుర్ర నరేష్, షేక్ మునీర్, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
చౌట్ పల్లి ఉన్నత పాఠశాలలో గురుపూజోత్సవం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES