Friday, July 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు

సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : జిల్లా కేంద్రంలోని ముబారక్ నగర్ డివిజన్ పరిధిలో లక్ష్మీ ప్రియ నగర్ కాలనీ వివి నగర్ కాలనీలో ఉన్న శ్రీ శివ సాయి బాబా ఆలయంలో గురువారం ఉదయం తెల్లవారుజామున నుండి గురుపౌర్ణమి ఉత్సవాలు అత్యంత వైబావోపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ అధ్యక్షుడు రచ్చ సుదర్శనం ఇతర కమిటీ సభ్యులు ఆయనను సాదరంగా స్వాగతించి సన్మానించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ సుదర్శనం మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా భక్తుల కోరిన కోరికలు తీరుస్తూ శివ సాయి బాబా ఆలయంలో భక్తుల కొంగుబంగారంగా నిలుస్తూ వస్తున్నారని అన్నారు.

ఎవరికి ఏ ఆపద వచ్చినా ఈ ఆలయంలో బాబాను దర్శించుకుని సమ సమస్యలను బాబాకు మనసులో కోరుకుంటే వెంటనే పరిష్కారం దొరుకుతుందని భక్తులు గత కొన్నేళ్లుగా నమ్ముతూ వస్తున్నారని ఆయన అన్నారు. అందుకే కాలనీలో భక్తులు ఆలయ అభివృద్ధి కొరకు విరాళాలను స్వచ్ఛందంగా వచ్చి ఇస్తూ ఉంటారని ఆయన అన్నారు. అలాగే ప్రతి గురువారం ఈ ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నామని దీనికి కూడా భక్తుల నుండి విశేష స్పందన లభిస్తుందంటే బాబా మహిమ ఎలాంటిదో అర్థమవుతుందని పేర్కొన్నారు. దయచేసి హిందూ మహిళలు యువతులు గుడికి వచ్చేటప్పుడు సాంప్రదాయబద్ధంగా రావాలని అప్పుడే హిందూ ధర్మాన్ని నిలబెట్టిన వారవుతామని అన్నారు. ఎందుకంటే కొంతమంది యువతులు గుడికి వచ్చిన కానీ చేతులకు గాజులు, స్పష్టంగా తిలకం బొట్టు కనబడే విధంగా రావాలని విజ్ఞప్తి చేశారు.

గురు పౌర్ణమి సందర్భంగా ఆలయ అర్చకులు ఓంకార్ పంతులు దంపతులకు ఆలయ కమిటీ వారు పాద పూజ చేశారు. అనంతరం మాజీ జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ వ్యాసముని జన్మదినం రోజున గురుపౌర్ణమి జరుపుకోవడం మన సాంప్రదాయమని ప్రతి ఒక్కరిపై ఆ సాయిబాబా ఆశీస్సులు ఉండాలని ఆయన కోరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేశారని అన్నారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ మహేష్ కుమార్, కోశాధికారి ఆనంద్ రావు, వైస్ ప్రెసిడెంట్ లు గంగదాసు, శ్రీనివాస్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -