Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్గురుకుల (బాలికల) పాఠశాలకు సొంత భవనం నిర్మించాలి 

గురుకుల (బాలికల) పాఠశాలకు సొంత భవనం నిర్మించాలి 

- Advertisement -

– అద్దె భవనాల్లో ఉండలేకపోతున్న విద్యార్థులు 
– ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులు
నవతెలంగాణ – కామారెడ్డి 

కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ఆసీస్ ఆసీస్ సాంగ్గ్వాన్ కు తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల వసతులు విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాలోత్ హరిలాల్ నాయక్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట్ మండలనికి మంజూరైన తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ప్రభుత్వ భవనం లేక కొన్ని సంవత్సరాలు తాడ్వాయి బాలికల గురుకుల పాఠశాలలో, గత నాలుగు సంవత్సరాల నుంచి కామారెడ్డి లోని దేవున్ పల్లి లో ప్రవేట్ ఆహ్వానంలో కొనసాగుతుంది అన్నారు.

ఈ పాఠశాలలో 500 పైగా విద్యార్థులు ఉన్నారనీ, ప్రవేట్ భవనం పిల్లలకు సరిపోవటం లేదు, చాలా ఇరుకుగా ఉందని, పిల్లలు ఆటలు ఆడుకోవడానికి గ్రౌండ్ లేదు, సరైన డైనింగ్ హాల్ లేదు, పిల్లలు కింద కూర్చొని అన్నం తింటున్నారు, క్లాస్ రూమ్స్ లలో, డార్మెటరీలలో సూర్యరశ్మి  సరిగా పడటం లేదనీ అని పిల్లల తల్లిదండ్రులు నాందేడ రమేష్, నాందేడ్ వనజ, బానోత్ రవి, జీవన్, లక్ష్మణ్ ఆవేదన చెందుతున్నట్లు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. ఆ ప్రైవేట్ భవనంలో వసతులు లేక విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారనీ తెలిపారు.

ఇదే స్కూల్ కు మంజూరైన ఇంటర్మీడియట్ (ఎమ్మెల్టి) ఒకేషనల్ కోర్స్ గత కొన్ని సంవత్సరాల నుంచి దోమకొండ గురుకుల పాఠశాలలో నడిచిందనీ, ప్రస్తుతం ఈ సంవత్సరము నుంచి  ఇంటర్మీడియట్ ఒకేషనల్  (ఎమ్మెల్టి)కోర్సును తీసివేయడం జరిగిందన్నారు.  ఎంపీసీ, బైపిసి కోర్సులు కూడా చాలా ఆలస్యంగా ప్రారంభించారు. అన్ని సమస్యలకు ముఖ్య కారణం సరైన ప్రభుత్వ భవనం లేకపోవడం, 2016 సంవత్సరంలో ఐదు ఎకరాలు స్థలం మంజూరై 9 సంవత్సరాల అవుతున్న, ఈ స్కూలు 9 సంవత్సరాలు పూర్తయిన కూడా స్కూలుకు కొత్త భవన నిర్మాణం మాత్రం ప్రారంభించడం లేదు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు చాలా నష్టం జరుగుతుందన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి అతి తొందరగా కొత్త భవనాన్ని నిర్మించలని కలెక్టర్కు ఇచ్చిన వినతి పత్రంలో కోరడం జరిగిందన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img