Monday, December 8, 2025
E-PAPER
Homeక్రైమ్ఈతకు వెళ్లి.. గురుకుల విద్యార్థి మృతి

ఈతకు వెళ్లి.. గురుకుల విద్యార్థి మృతి

- Advertisement -

– నిజాంసాగర్‌ ప్రాజెక్టు కాలువ వద్ద ఘటన
– గురుకులం నిర్వహణ తీరుపై తీవ్ర విమర్శలు
నవతెలంగాణ-నిజాంసాగర్‌

నిజాంసాగర్‌ ప్రాజెక్టు 16వ వరద గేటు వద్ద కాలువలో ఈతకు వెళ్లి గురుకుల విద్యార్థి మృతిచెందిన ఘటన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండలంలో ఆదివారం జరిగింది. గురుకులం కాలేజీలో ఉండాల్సిన విద్యార్థి ఇలా బయటకు రావడంపై.. గురుకులం నిర్వహణ తీరుపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని టీజీడబ్ల్యూఆర్‌జేసీ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వారిలో ఐదుగురు విద్యార్థులు స్నానం చేయడానికి ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో ప్రాజెక్ట్‌ 16వ గేటు వద్దనున్న కాలువలోకి వెళ్లారు. ఈ క్రమంలో అజరు(17) అనే విద్యార్థి స్నానం చేస్తున్న క్రమంలో కాల్వలో మునిగాడు.. పక్కనే ఉన్న విద్యార్థులు గమనించి అజరును ఓడ్డు మీదకు తీసుకు వచ్చేసరికి అపస్మారకస్థితిలోకి వెళ్లి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
గురుకులం నిర్వహణ తీరుపై తీవ్ర విమర్శలు
గురుకులం పాఠశాల, కళాశాల నిర్వహణపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాల ప్రిన్సిపాల్‌ జనార్ధన్‌ రెండు రోజుల నుంచి లీవ్‌లో ఉండగా ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా గణపతి ఉన్నారు. ఆదివారం డ్యూటీ టీచర్‌గా రవికాంత్‌ ఉన్నట్టు సమాచారం. ఆ సమయంలో విద్యార్థులు బయటకు వెళ్లడం గమనార్హం. ప్రిన్సిపల్‌ లేని సమయంలో గురుకులం నిర్వహణ తీరు సరిగ్గా ఉండటం లేదని విద్యార్థిసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -