డా. అరుళనందు, మాథ్యో అరుళనందు ఆధ్వర్యంలోని విజన్ సినిమా హౌస్ నిర్మాణ సంస్థ తమ మూడో చిత్రంగా ‘హైకు’ని ప్రకటించింది. నిర్మాతల్లో ఒకరైన డాక్టర్ అరుళనందు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, మళయాళం భాషల్లో రూపొందుతోంది. ఇందులో ఏగన్ హీరోగా నటిస్తున్నారు. ఆయనతో పాటు ‘కోర్ట్’తోగుర్తింపు పొందిన శ్రీదేవి అపల్ల, ‘మిన్నల్ మురళి’ చిత్రంతో ప్రేక్షకులకు దగ్గరైన ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను గమిస్తే.. ఇదొక రొమాంటిక్ డ్రామా అని తెలుస్తుంది.
యువతీ యువకుల్లోని అమాయకత్వంతో కూడిన ప్రేమ, విద్యార్థి జీవితంలో ఆశలు, వారు కనే కలల నేపథ్యంతో ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా రానుంది. విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ, సరికొత్త కథ, కథనాలతో సినిమాలను రూపొందిస్తోన్న డాక్టర్ అరుళనందుకి చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్‌ను రివీల్ చేయటం ద్వారా హృదయ పూర్వక అభినందనలు తెలియజేసింది. ఈ చిత్రానికి సంగీతం : విజయ్ బుల్గానిన్, స్క్రీన్ ప్లే : హరిహరన్ రామ్, యువరాజ్ చిన్నసామి, సినిమాటోగ్రఫీ: ప్రియేష్ గురుసామి, ఎడిటర్:శక్తి ప్రాణేష్, ఆర్ట్: వఇజు విజయన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఏగన్ అరుళ్‌నందు, కో ప్రొడ్యూసర్: శ్రీనివాస్ నిరంజన్.
భిన్న కాన్సెప్ట్‌తో ‘హైకు’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



