Saturday, July 5, 2025
E-PAPER
Homeఖమ్మంహస్తకళలు నైపుణ్యంతో వ్యర్ధాలు కు అలంకారం

హస్తకళలు నైపుణ్యంతో వ్యర్ధాలు కు అలంకారం

- Advertisement -

ఆర్ధిక పరమార్ధం…
– ఏడీఏ రవికుమార్
నవతెలంగాణ – అశ్వారావుపేట
హస్తకళలు నైపుణ్యంతో వ్యర్ధాలను సైతం అపురూపంగా మలిచి ఆర్ధిక పరమార్ధం కల్పించవచ్చు అని వ్యవసాయ శాక అశ్వారావుపేట సహాయ సంచాలకులు రవికుమార్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం కొబ్బరి అభివృద్ది బోర్డు విజయవాడ ప్రాంతీయ కార్యాలయం సంయుక్తంగా గత ఐదు రోజులు పాటు నిర్వహించిన  కొబ్బరి హస్తకళా నైపుణ్య అభివృద్ది శిబిరం ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.స్థానిక వ్యవసాయ కళాశాలలో వ్యవసాయ విస్తరణ విభాగం అధ్యాపకురాలు కే.శిరీష పర్యవేక్షణలో  30 జూన్ నుండి 05 జూలై తేదీ వరకు నిర్వహించిన ఈ శిబిరం శనివారంతో ముగిసింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ మహిళలు,యువతి యువకులు ఎంతో ఆసక్తిగా కొబ్బరి చిప్పల తో తయారు చేసిన అలంకరణ వస్తువులను చూసి ఎంతో ముచ్చట పడ్డారు.వ్యర్ధాలను సైతం హస్తకళా నైపుణ్యం అలంకరించి అర్థాన్ని  ఇచ్చారు అంటూ,ఔత్సాహిక యువత ఇటువంటి నైపుణ్యాలను నేర్చుకొని స్వయంగా ఎదగాలని,నేడు మార్కెట్లో ఇలాంటి అలంకరణ వస్తువులకు,పర్యావరణ మేలు కల్పించే ఆలోచన ఎంతో అభినందనీయం అన్నారు.వ్యవసాయ కళాశాల ఇంచార్జి ఏడీ డాక్టర్ ఐ.వి.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ  కొబ్బరి చెట్టుని కల్పతరువు అంటారు అని,దాని నుండి వచ్చే ప్రతి భాగం ఏదో ఒకలా అందరికీ ఉపయోగపడుతుందని అన్నారు.కొబ్బరి కాయ నుండి వచ్చే చిప్పలు ను సైతం వృధా చేయకుండా(  వ్యర్థాలను) వాటికి విలువ జోడించి అందమైన పూల కుండీలు, టీ కప్స్, కిడ్డీ బ్యాంక్స్,ఇయర్ రింగ్స్,జడ క్లిప్పు లు,టీ స్పూన్స్,సంగీత వాయిద్య పరికరాలు,ఫోటో ఫ్రేమ్, కుంకుమ భరిణె లు,తాబేలు బొమ్మ,చిన్న పిల్లలకు ఆట బొమ్మలు మొదలైన అలంకరణ వస్తువులు తయారుచేసిన శిక్షకులు అందరికీ అభినందనలు చెప్పారు.ఈ కార్యక్రమం ద్వారా నేర్చుకున్న నైపుణ్యాలను ఇక్కడ శిక్షణ పొందిన ట్రై నీలు  అందరు భవిష్యత్తులో ఒక గ్రూపు గా అయ్యి  ఇలాంటి వాటిని కొత్తగా తయారు చేసే పరిశ్రమ స్థాపించే లా ఎదగాలని ప్రోత్సహించారు.ఈ కార్యక్రమంలో కొబ్బరి కాయలు మరియు కొబ్బరి చిప్పల నుండి హస్త కళలు తయారు చేసే నైపుణ్యాలను నేర్పించిన బీహారు కు చెందిన మాస్టర్ ట్రై నర్ నికుంజ,వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్స్ నాగాంజలి,హెచ్.ఓ వేణుమాధవ్,ఏవో శివరాం ప్రసాద్ లు పాల్గొన్నారు.అనంతరం ఈ శిబిరం హస్తకళలు నైపుణ్యంతో ప్రదర్శించిన టి.సుస్మా,ఎస్కే షాహీదా,ఖాసీం సిమ్రాన్ లు కు ప్రధమ,ద్వితీయ,తృతీయ బహుమతులు అందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -