Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంకార్పొరేట్లకు దేశ సంపద అప్పగింత..

కార్పొరేట్లకు దేశ సంపద అప్పగింత..

- Advertisement -

కార్మిక, కర్షకుల ఆగ్రహం
ఎస్కేఎం, వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు
మోడీ, అమిత్‌షా, ట్రంప్‌ దిష్టిబొమ్మలు దహనం
నవతెలంగాణ-విలేకరులు

మోడీ విధానాలు, క్విట్‌ కార్పొరేట్‌ను వ్యతిరేకిస్తూ నాటి క్విట్‌ ఇండియా స్ఫూర్తితో సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్కేఎం), వామపక్ష కార్మిక సంఘాల పిలుపు మేరకు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్‌, మతోన్మాద, సామ్రాజ్యవాద అనుకూల విధానాలను నిరసిస్తూ దిష్టిబొమ్మలు దహనం చేశారు. ర్యాలీలు నిర్వహించారు. ‘మోడీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్‌ సంస్థలకు అప్పగిస్తోంది.. వారికే బీజేపీ ప్రభుత్వ అండదండలున్నాయి. ప్రజల కోసం ఆలోచించాలి.. దేశ ప్రయోజనాలను కాపాడాలి. లేకుంటే ప్రజలు బీజేపీని తరిమికొడతారు’ అని వామపక్షాల నాయకులు హెచ్చరించారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ చౌరస్తాలో మోడీ, అమిత్‌షా దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ క్రమంలో వారిని పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని సుభాష్‌ సెంటర్‌లో మోడీ, ట్రంప్‌ దిష్టిబొమ్మలను దహనం చేశారు. మిర్యాలగూడలో వామపక్షాల ఆధ్వర్యంలో అంబేద్కర్‌ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించి మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మర్రిగూడలో నిరసన తెలిపారు. నల్లగొండలో దిష్టిబొమ్మను దహనం చేశారు. నకిరేకల్‌లో మహిళా రైతు సంఘం ఆధ్వర్యంలో ట్రంప్‌, నరేంద్ర మోడీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. హుజూర్‌నగర్‌, కోదాడ, సూర్యాపేటలో నిరసన కార్యక్రమాలు చేపట్టి ట్రంప్‌, మోడీ దిష్టిబొమ్మలు దహనం చేశారు. యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలో అంబేద్కర్‌ విగ్రహం వద్ద ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad