Sunday, August 10, 2025
E-PAPER
spot_img
Homeజోష్చేనేత అవార్డుల పుట్లపాక

చేనేత అవార్డుల పుట్లపాక

- Advertisement -

చేనేత సప్తవర్ణాల కలబోత… భారతీయ సంప్రదాయానికి ప్రతీక… నాగరికతను మలుపు తిప్పిన కీలక రంగం… వన్నె తరగని హస్త కళా నైపుణ్యానికి నిదర్శనం.. వారసత్వ కళకు పెట్టింది పేరు… అద్భుత ఆకతులు సష్టించడంలో దిట్ట… స్వాతంత్య్ర పోరాటంలో స్వాభిమానం నేర్పింది… జాతి ఔన్నత్యాన్ని చాటింది… ఆరు గజాల నేత చీరెను అగ్గిపెట్టెలో ఒదిగిపోయేలా అందంగా మడత పెట్టి అంతర్జాతీయ కీర్తిని సొంతం చేసిన రంగం… ఆ వస్త్రాలు ధరిస్తే రాజసం ఉట్టిపడుతుంది… మగువల మనసు దోచే కళాత్మకం చూస్తే ఎవరైనా ఔరా అనాల్సిందే… కళ్లతో, కాళ్లతో, మునివేళ్లతో నేర్చుకున్న మగ్గం… అగ్గిపెట్టెలో ఆరు గజాల చీరని అందంగా మడతపెట్టి ఒదిగిపోయేలా ఎంతో చిక్కదనంతో నేసిన చీరతో అంతర్జాతీయ కీర్తి సొంతం చేసుకున్నారు మన కళాకారులు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలం పుట్టపాక చేనేతకు జాతీయ గుర్తింపు లభించింది. సౌకర్యాన్నీ, ఆధునికతను ఒంటికి చుట్టే ఈ వత్తిలోనే రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు గూడ పవన్‌. ఆ నైపుణ్యానికే జాతీయ యువ చేనేత పురస్కారానికి ఎంపికయ్యాడు. అతని సంక్షిప్త పరిచయం నేటి జోష్‌లో…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని పుట్టపాక గ్రామం అంటే పట్టు చీరలు, అరుదైన నేతకారుల నిలయం. ఈ గ్రామం నుంచి రెండు పద్మశ్రీ అవార్డులు, 10 జాతీయ అవార్డులు, 20కి పైగా రాష్ట్రస్థాయి అవార్డులు దక్కాయి. ఆ స్ఫూర్తితో తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని చేనేతలో ప్రయోగాలు చేస్తున్నాడు పవన్‌.
ప్రకతి రంగులతో మగ్గంపై డిజైన్‌….
సాధారణంగా పట్టు నూలుకు రంగులు అద్దడానికి రకరకాల రసాయనాలను వినియోగిస్తుంటారు. రసాయన వినియోగించడం వలన చీరలు డిజైన్‌ తయారు చేయడంలో ఇబ్బందులు పడడంతో పాటుగా, రంగు విలుచుకోవడానికి అవకాశం ఉంది. దీంతో ఆ చేనేత వస్త్రానికి విలువ తగ్గుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి అతను ప్రకతి నుంచి సేకరించిన బంతి పూలు, దానిమ్మ పండ్లు, మంజిష్ట వేర్లు, ఇండిగో నీలం, చావల్‌ కుడి పొడి, బెల్లం, వనమూలికలతో తయారుచేసిన సహజ సిద్ధ రంగులను ఉపయోగిస్తున్నాడు, సహజ సిద్ధరంగులను మల్బరీ పట్టుదారానికి అద్ది, జాతీయ భౌగోళిక గుర్తింపు (జియో టాగ్‌ ) పొందిన తేలియ రుమాల్‌ డిజైన్‌ తో పట్టు చీరలు మగ్గంపై నేస్తున్నారు, డిజైన్‌ తో మగ్గం పై నేయడంతో పాటుగా పట్టుచీరలో ప్రాచీనత సాంప్రదాయాలు, ప్రతిబింబించేలా రథంపేట, హౌమగుండం, బంతి పువ్వు, మల్లెపువ్వు, పచ్చీసు, చక్రం, వజ్రం , మద్ది కాయతో రంగులతో 16 రకాల వస్తువులతో డిజైన్‌ రూపొందించాడు.
ఆరు నెలలు కష్టపడాల్సిందే….
సహజ సిద్ధమైన రంగులను అద్దడానికి అద్దడానికి సుమారు ఆరు నెలలు కష్టపడాల్సి ఉంటుంది. ప్రకతి నుంచి సేకరించిన పదార్థాలను ఎండబెట్టి, 20 రోజులపాటు మగ్గ బెట్టాలి. తర్వాత వాటిని పొడి చేసి, సహజ సిద్ధ రంగులను తయారు చేస్తారు. ఈ రంగులను మల్బరి పట్టు దారానికి అద్ది తేలియా రుమాల్‌ డిజైన్‌ తో పట్టుచీర నేస్తారు. భారతీయ సంస్కతితో పాటుగా ప్రాచీన సాంప్రదాయం ఉట్టిపాడేలా ఆరు నెలలు శ్రమించి చీరలు తయారు చేస్తారు. చీర ముడతలు పడకుండా మదువైన పట్టును వాడతారు. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా చేనేత వత్తిని అందిపుచ్చుకున్న పవన్‌ ఇందులోనే ప్రత్యేకత చూపించాలనే పట్టుదలతో బీటెక్‌ చదువును సైతం మధ్యలోనే ఆపివేశాడు.
తేలియా రుమల్‌ డిజైన్‌ తో రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం దగ్గిన గుర్తింపుతో భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేస్తాం అంటున్నాడు. జాతీయస్థాయిలో యంగ్‌ వీవర్‌ పురస్కారం సాధించిన పవన్‌ ఆగస్టు 7వ తేదీన 11వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యూఢిల్లీలో నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవంలో కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్‌, సహాయ మంత్రి పబిత్ర మార్గరేటా తదితరుల చేతులమీదుగా పురస్కారం అందుకున్నారు.
చేనేత అంటే పొట్టకూటి కోసం చేసే ఉపాధి కాదు , ఇది భారతీయ సంస్కతి సాంప్రదాయాలను చాటే కళ్ళ అని నిరూపించాడు పవన్‌. వస్త్రాలు నేయడంలో ఆధునిక సౌకర్యాలతో పాటు ఆధునీకతను జోడించి, రకరకాల ప్రయోగాలను చేస్తూ, నైపుణ్యం సంపాదించడంతో గూడ పవన్‌ జాతీయ యువ చేనేత పురస్కారానికి ఎంపికయ్యాడు.
డిజైనర్‌ గా స్టేట్‌ అవార్డు
జాతీయ యువ చేనేత పురస్కారం అవార్డుతో పాటుగా రాష్ట్రస్థాయిలో డిజైనర్‌ గా అవార్డును చేనేత, జోళి శాఖ కమిషనర్‌ శైలజ రామయ్యర్‌ చేతుల మీదుగా తెలంగాణ స్టేట్‌ అవార్డును అందుకున్నారు. చేనేత అనేది బంగారంలాంటి కళ. ఆ కళకు ‘మార్కెటింగ్‌ నైపుణ్యం’ అనే గోడ చేర్పును తీసుకువచ్చి విజయం సాధించింది.

  • పాక జహంగీర్‌ యాదవ్‌
    9505030405
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img