– బడ్జెట్‌లో రూ. నాలుగు వేల కోట్లు కేటాయించాలి : ఆర్థిక శాఖ మంత్రికి మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
చేనేత, పవర్‌లూమ్‌లకు తగిన బడ్జెట్ కేటాయించి ఆదుకోవాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర గౌరవా ధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, అధ్యక్షులు వనం శాంతికుమార్, ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్, కార్యదర్శి ముషం నరహరి, ఉపాధ్యక్షులు వర్కాల చంద్ర శేఖర్‌తో కలిసి ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు వినతిపత్రాన్ని సమర్పిం చారు. రాబోయే బడ్జెట్‌లో చేనేతకు రూ. రెండు వేల కోట్లు, పవర్ లూమ్‌కు రూ. రెండు వేల కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. చేనేత కార్మికులకు త్రిఫ్ట్ పథకంలో కార్మికుడు రూ. 1200 అనుబంధ కార్మికుడు రూ. 800 రిక రింగ్ డిపాజిట్ చేస్తే, ప్రభు త్వం రూ.2, 400, రూ. 1600 డిపాజిట్ చేస్తుం దని తెలిపారు. చేనేత కార్మికులు బ్యాంకులో రికరింగ్ డిపాజిట్ చేసినా ప్రభుత్వం రెండు నెలలే డిపాజిట్ చేసి, తొమ్మిది నెల్ల నుంచి డిపాజిట్ చేయ లేదని తెలిపారు. చేనేత భరోసా పథకం అమలు చేస్తామని ప్రకటించి రెండేండ్లు అవుతుందనీ, ఈ పథకంలో జియో టాగ్ ఉన్న చేనేత కార్మికుడికి నెలకు రూ. రెండు వేలు, అనుబంధ కార్మికుడికి రూ. ఐదొందల చొప్పున ఇద్దరికి వారి వారి బ్యాంకు అకౌంట్లలో వేయాలని ఉన్నా… రెండేండ్లు దాటినా వేయలేదని పేర్కొన్నారు. నేతన్న భీమా పథకంలో 59 ఏండ్ల లోపల ఇన్సూ రెన్స్ కంపెనీలు ఇవ్వగా 59 ఏండ్లు నిండిన వారికి టెస్కో (టీజీఎస్‌సీఓ) ద్వారా ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలనీ, సంవత్సరం దాటిన మరణించిన చేనేత కార్మికుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందలేదని తెలిపారు. గత బడ్జెట్‌లో తగిన విధంగా నిధులు కేటాయించ లేదనీ, అందువల్లనే పథకాలను అమలు చేయలేక పోతున్నామని అధికారులు చెబుతున్నారని గుర్తు చేశారు.
చేనేత, పవర్‌లూమ్‌లను ఆదుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



