- Advertisement -
త్రిపుర తరఫున ఆడనున్న విహారి
హైదరాబాద్ : భారత క్రికెటర్ హనుమ విహారి (31) దేశవాళీ సర్క్యూట్‌లో మరోసారి ఆంధ్రను వీడాడు. భారత్‌కు 16 టెస్టుల్లో ప్రాతినిథ్యం వహించిన హనుమ విహారి దేశవాళీలో (ఆంధ్ర 44, హైదరాబాద్ 40 మ్యాచులు) 14 సెంచరీలు, 32 అర్థ సెంచరీలతో 6168 పరుగులు చేశాడు. 2023-24 సీజన్‌లో వివాదాస్పద పరిస్థితుల్లో ఆంధ్రను వీడిన విహారితో మాట్లాడిన ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు మళ్లీ ఆంధ్రకు ఆడాలని సూచించారు. మూడు ఫార్మాట్లలో త్రిపురకు ఆడాలనే ఉద్దేశంతో విహారి ఎన్‌ఓసీ కోరగా.. ఆంధ్ర క్రికెట్ సంఘం 24 గంటల్లోనే ఇవ్వటం గమనార్హం.
- Advertisement -