నవతెలంగాణ–హైదరాబాద్: ప్రధానమంత్రి మోడీ 75వ పుట్టినరోజును పురస్కరించుకొని … అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు. తన మిత్రుడు ట్రంప్ ఫోన్ చేశారని ప్రధాని మోడీ ఎక్స్ (ట్వీట్) వేదికగా బుధవారం పోస్టు చేశారు. ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫాంలో పోస్ట్ చేసిన ప్రకారం … ” నా స్నేహితుడు ప్రధాని నరేంద్ర మోడీతో అద్భుతమైన ఫోన్ కాల్ జరిగింది. నేను వారికి హ్యాపీ బర్త్‌డే చెప్పాను ! వారు గొప్ప పని చేస్తున్నారు. నరేంద్ర : రష్యా – ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో మీ మద్దతుకు ధన్యవాదాలు! ” అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ పోస్టుకు ప్రధాని మోడీ స్పందిస్తూ … ట్రంప్ లాగే తానూ భారత్-అమెరికా సమగ్ర భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ప్రపంచ భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉక్రెయిన్-రష్యా వివాద పరిష్కారం కోసం ట్రంప్ చొరవకు మద్దతు ఇస్తున్నట్లు మోడీ తెలిపారు.
