ఆర్టీఐ నాయకులు వెంకటేశ్వర్లు, కుమార్ యాదవ్
నవతెలంగాణ – మల్హర్ రావు
మహిళలు కుటుంబ సంక్షేమం కోసం శ్రమించే త్యాగశీలులని,సమాజ నిర్మాణంలో స్త్రీల పాత్ర గొప్పదని ఈ నెల8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తేలుపుతున్నట్లుగా యునైటెడ్ ఫోరమ్ పర్ ఆర్టీఐ జిల్లా కన్వీనర్ చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్,కోకన్విర్ చింతల కుమార్ యాదవ్ శనివారం ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కుటుంబ నిర్మాణం, సంక్షేమంలో మహిళల పాత్ర అనిర్వచనీయమని, సమాజ నిర్మాణంలోనూ వారి కృషి చాలా గొప్పదన్నారు. మహిళ గర్భం దాల్చిన నుండి మరణించే వరకు అనేకమైన కష్టాలు, వివక్షలకు, హింసలకు గురవుతున్నారని, ఆర్థికంగా సామాజికంగా శారీరకంగా వారి యొక్క సర్వం సమాజ శ్రేయస్సు, కుటుంబ శ్రేయస్సు కోసం అర్పిస్తూ సమాజ అభివృద్ధికి వెన్నెముకల తోడ్పాటు అందిస్తున్నారని కొనియాడారు. మద్యపానం, మత్తు, గంజాయి వంటి దురాలవాట్లను రూపుమాపడానికి మహిళలు తమవంతుగా కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. మహిళల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చిత్రాలు తీసుకొచ్చిన అవి అమలు కావడం లేదన్నారు. అమలయ్యేలా చేయాలని విజ్ఞప్తి చేశారు.



