– ప్రపంచ శాంతికి భంగం : వనస్థలిపురం ర్యాలీలో మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ-వనస్థలిపురం
పశ్చిమ ఆసియా దేశాల్లో యుద్ధం కారణంగా అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. పెన్షన్ సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్ వనస్థలిపురంలో యుద్ధ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. పనామా నుంచి రెడ్ ట్యాంకు వరకు ర్యాలీని నర్సిరెడ్డి ప్రారంభించారు. ‘యుద్ధం వద్దు… ప్రపంచ శాంతి ముద్దు’ అనే నినాదాలతో పెద్ద ఎత్తున ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తక్షణమే యుద్ధ విరమణ చేసి శాంతిని నెలకొల్పాలని డిమాండ్ చేశారు. యుద్ధ ప్రభావంతో దేశంలో వస్తువుల ధరలు పెరుగుతున్నాయని, దీనివల్ల ఆర్థిక పరిస్థితులు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హోటళ్ల నిర్వహణ కష్టంగా మారిందని, గ్యాస్ సరఫరా సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. యుద్ధానికి వ్యతిరేకంగా ప్రజా చైతన్యం కల్పించాలని పిలుపునిచ్చారు. ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేస్తోందని అమెరికా అధ్యక్షులు ట్రంప్ తప్పుడు ప్రచారం చేసి యుద్ధం కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఈ పరిణామాలతో ప్రపంచ శాంతి భంగమవుతోందన్నారు. ఈ కార్యక్రమంలో పెన్షన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కృష్ణారావు, కార్యదర్శి నోముల సుదర్శన్‌రెడ్డి, బ్రహ్మచారి, అనసూయ, బీజీఎం రెడ్డి, కీసరి నర్సిరెడ్డి, ముషం నరహరి తదితరులు పాల్గొన్నారు.
యుద్ధాలతో ఇబ్బందులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



