నవతెలంగాణ – పెద్దవూర
ఉపాధ్యాయ దినోత్సవానికి నిధులు మంజూరు చేసినందుకు సిఎం రేవంత్ రెడ్డికి, తెలంగాణ ప్రభుత్వానికి నల్గొండ జిల్లా అవార్డు టీచర్స్ అసోసియేషన్ తరుపున జిల్లా అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు వడిత్య వెంకట్రామ్ నాయక్, నన్నూరి వెంకట్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. బుధవారం వారు ఒక ప్రకటన లో తెలిపారు. సెప్టెంబర్ 5నడాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా మండల మరియు జిల్లా స్థాయిలో నిర్వహించే ఉత్తమ ఉపాధ్యాయ దినోత్సవ నిర్వహణకు గాను ప్రతి మండలానికి రూ.5000లు, ప్రతి జిల్లాకు రూ.15000 ల చొప్పున నిధులు మంజూరు చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదములు తెలిపారు.
అలాగే విద్యాశాఖ సెక్రటరీ,పాఠశాల విద్యాసంచాలకులు డాక్టర్ నవీన్ నికోలస్ ఐఏఎస్ కు కృతజ్ఞతలు తెలిపారు. పవిత్రమైన ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తూ ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులకు క్రమశిక్షణతో మెలిగి, చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తూ, అంకితభావంతో విద్యా బోధన మరియు మానవత విలువలు బోధిస్తూ సమాజాన్ని చక్కని మార్గం చూపిస్తు నాణ్యమైన విద్యను అందిస్తున్న ఉపాధ్యాయులను ఎంపిక చేసి మండలము మరియు జిల్లాస్థాయిలో అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో నిర్వహించడం ఎంతో అభినందనీయమని తెలిపారు.
నిధులు కేటాయింపుతో హార్షం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES