No menu items!
Monday, August 25, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeసినిమాహ్యాట్రిక్‌ బ్లాక్‌బస్టర్స్‌

హ్యాట్రిక్‌ బ్లాక్‌బస్టర్స్‌

- Advertisement -

‘ఈటీవీ విన్‌’లో విడుదలైన ‘కానిస్టేబుల్‌ కనకం, ఆల్‌ ఇండియా ర్యాంకర్స్‌, అనగనగా’ చిత్రాలు అద్భుతమైన విజయంతో హ్యాట్రిక్‌ బ్లాక్‌బస్టర్స్‌ అందుకున్నాయి. ప్రతి చిత్రం రికార్డ్‌ బ్రేకింగ్‌ వ్యూస్‌తో టాప్‌ ట్రెండింగ్‌లో స్ట్రీమ్‌ అవుతున్నాయి. ఈ సందర్భంగా మేకర్స్‌ తెలుగు వినోదోత్సవం హ్యాట్రిక్‌ బ్లాక్‌ బస్టర్‌ సెలబ్రేషన్స్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈటీవీ బిజినెస్‌ హెడ్‌ సాయి కష్ణ మాట్లాడుతూ, ‘హ్యాట్రిక్‌ సక్సెస్‌ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈనెల 29 ప్రపంచ తెలుగు దినోత్సవం. దీన్ని ఎవరు జరుపుకోవడం లేదు. ఈటీవీ విన్‌ సైడ్‌ నుంచి మేము దీనికి శ్రీకారం చుడుతున్నాం. ఇది తెలుగు వినోదోత్సవం. ఈనెల 23 నుంచి 29 వరకు ఈటీవీ విన్‌ కేవలం 29 రూపాయలకే సబ్స్రిప్షన్‌ చేసుకోండి. ‘కానిస్టేబుల్‌ కనకం, ఆల్‌ ఇండియా ర్యాంకర్స్‌, అనగనగా’ ఈ సినిమాల విజయాల క్రెడిట్‌ దర్శక, రచయితలకు, నటీనటులకు, ఈ విన్‌ టీంకు దక్కుతుంది’ అని తెలిపారు.
‘ఈ మూడు సక్సెస్‌మీట్‌లు కలుపుకొని ఒక వేడుకగా చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈటీవీ విన్‌లో మనందరికీ నచ్చే మన కథలు ఉంటాయి. అవి ఉన్నంతకాలం మనం ఇలా కలుస్తూనే ఉంటాం’ అని ఈటీవీ విన్‌ కంటెంట్‌ హెడ్‌ నితిన్‌ చక్రవర్తి చెప్పారు. ఈ వేడుకలో నాయిక వర్ష బొల్లమ్మ, డైరెక్టర్‌ ప్రశాంత్‌, ప్రొడ్యూసర్‌ సాయిబాబా, రచయిత బివిఎస్‌ రవి, డైరెక్టర్‌ సందీప్‌ రాజ్‌, నటులు చైతన్యరావు, హర్ష, డైరెక్టర్‌ జోసఫ్‌, డైరెక్టర్‌ సన్నీ తదితరులు పాల్గొని తమ విజయానందాన్ని వ్యక్తం చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad