Wednesday, July 2, 2025
E-PAPER
Homeఎడిట్ పేజి'యూత్‌ డిక్లరేషన్‌' మరిచారా?

‘యూత్‌ డిక్లరేషన్‌’ మరిచారా?

- Advertisement -

ఎన్నికల సందర్భంగా తెలం గాణ విద్యార్థి, నిరుద్యోగ యువ తకి హైదరాబాద్‌ యాత్‌ డిక్లరేషన్‌ పేరుతో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చి రెండేండ్లు కావస్తున్నా నెరవేర్చడం లేదు. ప్రధానంగా విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్‌ అందిస్తామని, బాసరలోని రాజీవ్‌ గాంధీ ఐఐటి తరహాలో నాలుగు నూతన ఐఐటిలను ఏర్పాటు చేసి గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్యనంది స్తామని, అమెరికాలోని ఐఎంజీ అకాడమీ తరహాలో అన్ని వసతు లతో కూడిన ప్రపంచస్థాయి క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి కిందిస్థాయి క్రీడాకారులను కూడా ప్రోత్సహి స్తామని పేర్కొంది.

అలాగే ప్రతి విద్యార్థికి రూ.5లక్షల విద్యా భరోసా కార్డు అందిస్తామని, విద్యార్థులకు ఫ్రీ వైఫై సౌకర్యం కల్పిస్తామని, భారత దేశంలోనే తెలం గాణను ఒక నాణ్యమైన ఎడ్యుకేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటిం చింది.ప్రతి మండలంలో ఆధునా తనమైన సౌకర్యలతో, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఉన్నత పాఠశాలలను ఏర్పాటు చేసి, ఉచిత ట్రాన్స్‌పోర్ట్‌ సౌకర్యం కల్పిస్తామని కూడా వాగ్దానాలు చేసింది.

ఇందులో ఒక్క టంటే ఒక్క హామీ కూడా నెరవేర్చని పరిస్థితి ఉన్నది. ప్రయి వేటు విద్యాసంస్థల్లో అధిక ఫీజులను అరికట్టేందుకు ఫీ రెగ్యు లేషన్‌ కమిటీ ఏర్పాటుచేసి ప్రయి వేటు స్కూళ్లలో ఫీజులను నిర్ణయిస్తామని చెప్పింది. యువ మహిళా సాధికారత పేరుతో 18 ఏండ్లు పైబడి, చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రానిక్‌ స్కూటర్‌ అందిస్తామని, విద్యా జ్యోతుల పథకం పేరుతో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు పదవ తరగతి పాసైతే రూ. 10వేలు,ఇంటర్‌ పాసైతే 15 వేలు, గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేస్తే 25వేలు, పీజీ పూర్తి చేస్తే లక్ష రూపాయలు, ఎంపిల్‌, పీహెచ్‌డీ పూర్తిచేసిన వారికి అక్షరాల రూ.5లక్షలు అందజేస్తామని హామీనిచ్చింది. అధికారంలోకి వచ్చి పందొమ్మిది నెలలు కావస్తున్నా కనీసం చర్చకు కూడా పెట్టడం లేదంటే హామీలన్నీ విస్మరిస్తున్నారనే చర్చ జరుగుతోంది.


రాష్ట్రంలో విద్యాశాఖ స్వయంగా ముఖ్యమంత్రి వద్దే ఉండటంతో తమ భవిష్యత్తు కలలు నెరవేరుతాయని విద్యా ర్థులు, నిరుద్యోగులు ఎన్నో కలలు కన్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తేవారికి నిరాశే ఎదురవుతున్నది. ప్రత్యేకంగా విద్యా శాఖకు మంత్రిని కేటాయిస్తే కనీసం పర్యవేక్షణైనా ఉండేది. ఇప్పుడా పరిస్థితి కూడా లేదు. ప్రస్తుతం విద్యా సంవత్సరం ఆరంభమై ఒడిదొడుకుల మధ్య సాగుతున్నది. గురుకుల అద్దె భవనాలకు అద్దె చెల్లించకపోవడంతో ఈ విద్యా సంవ త్సరం ఆరంభంలోనే వాటి యజమానులు అద్దె భవనాలకు తాళాలు వేసుకున్న దుస్థితి నెలకొంది. అందాల పోటీలకు కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టిన ప్రభుత్వం కనీసం అద్దెను చెల్లించడం చేతకావడం లేదా అని చాలామంది విద్యావేత్తలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి ఉంది.

నిరుద్యోగ యువతకి పారదర్శకంగా ప్రభుత్వ ఉద్యోగ నియా మకాలు చేపడతామని చెప్పి, మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించిన సర్కార్‌ ఇప్పుడేం చేస్తోంది? పైగా మొదటి ఏడాదిలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బ్యాక్‌లాగ్‌ పోస్టులను భర్తీ చేస్తామని హామీనిచ్చి బుట్టదాఖలు చేస్తోంది.ప్రతి ఏడాది జూన్‌ 2 నాటికీ అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి, సెప్టెంబర్‌ 17లోపు నియామకాలను పూర్తి చేస్తామని చెప్పింది. నిరుద్యోగ యువతకి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే వరకు ప్రతినెలా రూ.4వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తా మని పేర్కొంది. సర్కార్‌ కనీసం ఆ ఊసే తీయడం లేదు.
నిరుద్యోగ రహిత రాష్టంగా తెలంగాణ తీర్చిదిద్దేందుకు సెంట్రలైజడ్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌పోర్ట్‌లు ఏర్పాటు చేసి, ఏడు జోన్‌లలో ఎంప్లాయి మెంట్‌ ఎక్సెంజ్‌లను, ప్రతి జిల్లాలో స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ సెంటర్లను నెలకొల్పుతామని హామీనిచ్చింది.

ప్రభుత్వ రాయి తీలు పొందిన ప్రయివేట్‌ కంపెనీల్లో తెలం గాణ యువతకి 75శాతం రిజర్వేషన్‌ను, విద్యా,ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు యూత్‌ కమిషన్‌ ఏర్పాటు చేసి రూ. పది లక్షల వరకు వడ్డీలేని రుణ సదుపాయాన్ని కల్పి స్తామని నమ్మబలికింది. రూరల్‌ యాత్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ను రూ.1000 కోట్ల నిధితో ఏర్పాటు చేసి యువతకు స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తామని ప్రకటించింది. ఈ హామీలన్నీ అటకెక్కించినట్టేనా? వీటి గురించి ఎందుకు ఆలోచించడం లేదు. ఇప్పటికైనా హైదరా బాద్‌ యూత్‌ డిక్లరేషన్‌ను అమలు చేయాలి. ఎంతోమంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. కోచింగ్‌సెంటర్లలో శిక్షణ పొందుతున్నారు. ఏవో కొన్ని ఉద్యోగాలిచ్చి చేతులు దులుపుకోవడం కాదు. వెంటనే జాబ్‌ క్యాలెండర్‌ను ప్రకటించాలి. ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి.లేదంటే విద్యార్థులు, నిరుద్యోగులు తమ భవిష్యత్తు కోసం పోరాటాల తోనే పాలకులపై ఒత్తిడి తీసుకురావాలి.
అనంతుల మధు
9505866698

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -