- Advertisement -
మాజీ కార్యదర్శి విజయానంద్ అభినందన
హైదరాబాద్: రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన మహ్మద్ అజారుద్దీన్ ను హైదరాబాద్ క్రికెట్ సంఘం మాజీ కార్యదర్శి ఆర్. విజయానంద్ మంగళవారం సచివాలయంలోని ఆయన కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అజారుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న పర్యాయం విజయానంద్ కార్యదర్శిగా పని చేశారు. ఈ సందర్భంగా ఇద్దరూ తమ పాత అనుబంధాన్ని, క్రికెట్ రంగంలో కలిసి పనిచేసిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అజారుద్దీన్ మరింత గొప్పగా రాణించాలని ఈ సందర్భంగా ఆర్. విజయానంద్ ఆకాంక్షించారు.
- Advertisement -



